PAK vs NZ: సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌కు కెప్టెన్సీ.. ఐసీసీ రూల్స్ తెలియక మరోసారి నవ్వుల పాలైన పాక్ ఆటగాళ్లు!

కరాచీ: ఐసీసీ రూల్స్ తెలియక పాకిస్థాన్ ఆటగాళ్లు మరోసారి నవ్వుల పాలయ్యారు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌తో కెప్టెన్సీ చేయించబోయి పరువు తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యం కారణంగా మైదానంలోకి రాలేదు. ఈ టెస్టుకు పాక్ వైస్ కెప్టెన్‌ను ప్రకటించకపోవడంతో.. జట్టును ఎవరు నడిపించాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది. బాబర్ స్థానంలో జట్టులోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
రూల్ ప్రకారం..
కానీ ఎంసీసీ రూల్ 24.1.2 ప్రకారం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైదానంలో అధికారిక కెప్టెన్‌గా వ్యవహరించలేడు. దీంతో పాకిస్థాన్ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలను సర్ఫరాజ్ ఖాన్‌కు అప్పగించింది. నౌమన్ అలీ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దీంతో డీఆర్ఎస్ కోసం రిజ్వాన్‌తో మాట్లాడకుండానే సర్ఫరాజ్ థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. బాబర్ గైర్హాజరీలో జట్టును సర్ఫరాజ్ ముందుకు నడిపాడని.. రిజ్వాన్‌కు పగ్గాలు అప్పగించలేదని ఈ విధంగా పాక్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.

టీ20 ప్రపంచకప్‌లోనూ..
టీ20 ప్రపంచకప్‌లోనూ ఇలానే రూల్స్ తెలియక పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. భారత్‌తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో అంపైర్ నోబాల్ నిర్ణయాన్ని తప్పుబట్టడం.. తర్వాత డెడ్ బాల్ ఇవ్వాలని కోరడం.. దాని కోసం నానా యాగీ చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. నోబాల్ అనంతరం కోహ్లీ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. భారత ఆటగాళ్లు పరుగు తీయగా.. పాక్ ఆటగాళ్లు వ్యతిరేకించారు. చివరకు తప్పు తెలుసుకొని సైలెంట్ అయిపోయారు.

ధీటుగా బదులిస్తున్న కివీస్..
కరాచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (161), అఘా సల్మాన్ (103) శతకాలు చేయడంతో పాకిస్థాన్ 438 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ధీటుగా బదులిస్తోంది. టామ్ లాథమ్(113) సెంచరీతో చెలరేగగా.. డేవాన్ కాన్వే(92) తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
క్రీజులో కేన్ విలియమ్సన్(67 బ్యాటింగ్)తో పాటు టామ్ బ్లండెల్(7 బ్యాటింగ్) ఉన్నాడు. టీ బ్రేక్ సమయానికి 101 ఓవర్లలో 4 వికెట్లకు న్యూజిలాండ్ 356 పరుగులు చేసింది. కివీస్ ఇంకా 82 పరుగుల వెనుకంజలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications