For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs NZ: సెంచరీల టార్చ్ బేరర్.. డెవాన్ కాన్వే సరికొత్త రికార్డు!

PAK vs NZ: Devon Conway becomes 1st player to score opening hundred in consecutive years

కరాచీ: పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే(191 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 122) సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ ఏడాది సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఈ కివీస్ ఓపెనర్ రికార్డు సాధించాడు. కాకతాళీయమో ఏమో కానీ గతేడాది కూడా తొలి సెంచరీ అందుకున్నది డేవాన్ కాన్వేనే కావడం విశేషం. గతేడాది జనవరిలో బంగ్లాదేశ్‌తో మౌంట్‌మాంగనీ వేదికగా జరిగిన టెస్ట్‌లో 227 బంతుల్లో కాన్వే 122 పరుగులు చేశాడు. దాంతో వరుసగా రెండేళ్లు ప్రారంభ సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్‌గా డేవాన్ కాన్వే చరిత్ర సృష్టించాడు.

పాకిస్థాన్‌తో కరాచీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 92 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ చేజార్చుకున్న కాన్వే.. ఆ ముచ్చట రెండో టెస్ట్‌లో తీర్చుకున్నాడు. కాన్వే సెంచరీతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. కాన్వేకు తోడుగా ఓపెనర్ టామ్ లాథమ్(100 బంతుల్లో 9 ఫోర్లతో 71) రాణించాడు. కేన్ విలియమ్సన్(36), హెన్రీచ్ నికోల్స్(26) విఫలమయ్యారు. క్రీజులో టామ్ బ్లండెల్(30 బ్యాటింగ్), ఇష్ సోదీ(11 బ్యాటింగ్) ఉన్నారు.

పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. అఘా సల్మాన్ మూడు వికెట్ పడగొట్టాడు. అబ్రర్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కింది. ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం అందించిన అనంతరం నసీమ్ షా బౌలింగ్‌లో టామ్ లాథమ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేన్ మామతో కలిసి కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సెంచరీ అనంతరం కాన్వేను అఘా సల్మాన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్(3), హెన్రీ నికోల్స్ వరుసగా ఔటయ్యారు.

Story first published: Monday, January 2, 2023, 20:05 [IST]
Other articles published on Jan 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+