
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కొత్త ఏడాదిని రనౌట్‌తో ప్రారంభించాడు. న్యూజిలాండ్‌తో కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తు బాబర్ ఆజామ్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్‌లో సెంచరీ బాది భీకర ఫామ్‌లో ఉన్న బాబర్.. లేని మూడో పరుగుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇమామ్ ఉల్ హక్‌తో సమన్వయ లోపం బాబర్ ఆజామ్(24) కొంపముంచింది. ఇద్దరూ ఒకే ఎండ్‌వైపు పరుగెత్తడంతో న్యూజిలాండ్ పని సులువైంది.
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్(74 బ్యాటింగ్), సౌద్ షకీల్(13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బాబర్ ఆజామ్‌తో పాటు అబ్దుల్లా షఫీక్(19), షాన్ మసూద్(20), విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్ తలో వికెట్ తీసారు.
అంతకుముందు 309/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ 449 పరుగులకు కుప్పకూలింది. ఓవర్ నైట్ బ్యాటర్ ఇష్ సోదీ(11) మరో పరుగు చేయకుండానే ఔటవ్వగా.. టామ్ బ్లండెల్(51) హాఫ్ సెంచరీ అనంతరం ఔటయ్యాడు. ఆ వెంటనే టీమ్ సౌథీ(10) కూడా ఔటవ్వడంతో కివీస్ 345 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగింది. కానీ మ్యాట్ హెన్రీ(68 నాటౌట్), అజాజ్ పటేల్(35) అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు. చివరి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఈ సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో 58 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టారు. పాకిస్థాన్ ఇంకా 295 పరుగుల వెనుకంజలో ఉంది.
సంక్షిప్త స్కోర్లు:
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 449 ఆలౌట్ (డేవాన్ కాన్వే 122, టామ్ బ్లండెల్ 51, మ్యాట్ హెన్రీ 68 నాటౌట్)
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 47 ఓవర్లలో 154/3 (ఇమామ్ ఉల్ హక్74 బ్యాటింగ్, సౌద్ షకీల్ 13 బ్యాటింగ్)