Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs NZ: మరో సిరీస్ ఓటమి.. నీ కెప్టెన్సీ ఊడేలా ఉందిరా ఆజామూ!

PAK vs NZ: Babar Azam brutally trolled after New Zealand beat Pakistan in 3rd ODI

న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతగడ్డపై పాకిస్థాన్ మరో సిరీస్ కోల్పోవడంతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గతేడాది ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్, వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. చివర్లో ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయ్యింది. మూడు టెస్ట్‌ల్లో చిత్తయిన బాబర్ సేన.. అంతకుముందు టీ20 సిరీస్‌లో కూడా ఓడింది. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను డ్రా చేసుకొని పరువు కాపాడుకున్న పాకిస్థాన్.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్ గెలిచి ఈ సిరీస్‌లో శుభారంభం చేసిన పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి సిరీస్ చేజార్చుకుంది.

చివరి వన్డేలో ఓటమి..

చివరి వన్డేలో ఓటమి..

శుక్రవారం జరిగిన చివరి వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఫకార్ జమాన్(122 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(77) హాఫ్ సెంచరీతో రాణించాడు. అఘా సల్మాన్(45) పర్వాలేదనిపించాడు.

కివీస్‌ను గెలిపించిన ఫిలిప్స్..

కివీస్‌ను గెలిపించిన ఫిలిప్స్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 8 వికెట్లకు 281 పరుగులు చేసి మరో 11 బంతులుండగానే విజయాన్నందుకుంది. డెవాన్ కాన్వే(65 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52), కేన్ విలియమ్సన్(68 బంతుల్లో 2 ఫోర్లతో 53), గ్లేన్ ఫిలిప్స్(42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీం, అఘా సల్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. మహహ్మద్ నవాజ్, ఉస్మా మిర్ తలో వికెట్ తీసారు. ఫిలిప్స్ అసాధారణ బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌కు విజయాన్నందించాడు.

కెప్టెన్సీపై వేటు..

కెప్టెన్సీపై వేటు..

సొంతగడ్డపై వరుస ఓటములతో పాటు బ్యాటింగ్‌లోనూ బాబర్ ఆజామ్ విఫలమవుతుండటంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలున్నాయి.

పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం బాబర్ ఆజామ్‌ను తొలగించి.. టెస్టు, వన్డే సారథ్య బాధ్యతలు షాన్ మసూద్‌కు అప్పగించాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిపోర్ట్‌లను ఉద్దేశించే పాక్ ఫ్యాన్స్ బాబర్ ఆజామ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నీ బొమ్మ తిరగబడే రోజు వచ్చిందిరా ఆజామూ... అని సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Saturday, January 14, 2023, 14:23 [IST]
Other articles published on Jan 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+