Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs NEP: రిజ్వాన్ ఎందుకంత బద్దకం.. విచిత్రకర రీతిలో రనౌట్? (వీడియో)

ముల్తాన్: పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా నేపాల్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రిజ్వాన్ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఓవైపు దురదృష్టం.. మరోవైపు నిర్లక్ష్యం అతని రనౌట్‌కు కారణమైంది. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రిజ్వాన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బద్దకమా? అని ప్రశ్నిస్తున్నారు.

లమిచ్చనే వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రిజ్వాన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకున్న దిపేంద్ర సింగ్.. నాన్‌స్ట్రైకర్ వికెట్లకు డైరెక్ట్ హిట్ చేశాడు. అప్పటికే రిజ్వాన్ క్రీజులోకి చేరినా బ్యాట్‌ను పెట్టడం మరిచిపోయాడు. రన్నింగ్ చేసే మూమెంట్‌లో అతని రెండు కాళ్లు గాల్లో ఉండటంతో థర్డ్ అంపైర్‌గా ఔట్‌గా ప్రకటించాడు.

Mohammed Rizwan bizarre run out

బ్యాట్‌ను రుబ్బుతూ పరుగెత్తినా అతను నాటౌట్‌గా నిలిచేవాడు. క్రీజులోకి వచ్చాననే నిర్లక్ష్యమే అతని ఔట్‌కు కారణమైంది. బ్యాట్‌ను నేలకు రుబ్బుతూ పరుగు తీయాలని కోచ్‌లు తరుచూ చెబుతారు. ఈ బేసిక్ పాయింట్‌ను రిజ్వాన్ ఎలా మరిచిపోయాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే హెల్మెట్ పెట్టుకోకపోవడమే రిజ్వాన్ కొంపముంచిందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. రిజ్వాన్ ఔటైన తీరుపై ట్వీటర్ వేదికగా స్పందించాడు.

'ఫీల్డర్ త్రో యొక్క ఎత్తును బాబర్ ఆజామ్ తప్పించుకోలేకపోయాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రనౌట్‌ను తప్పించుకునేందుకు డైవ్ చేస్తారు. అయితే ఇలా కవర్‌లో ఆడి ఔటవ్వడం చాలా అరుదు. హెల్మెట్ ధరించకపోవడంతోనే రిజ్వాన్ డైవ్ చేయలేకపోయాడు. స్పిన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడటం రిజ్వాన్‌కు ఇష్టం. హెల్మెట్ లేకుండా ఆడటం అతని ఔట్‌కు కారణమైంది.'అని అశ్విన్ ట్వీట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఫకార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) దారుణంగా విఫలమయ్యారు. ఫకార్ జమాన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. ఇమామ్ ఉల్ హక్ రనౌటయ్యాడు. దాంతో పాక్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో బాబర్ ఆజామ్, రిజ్వాన్ పాక్‌‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. అఘా సల్మాన్(5) విఫలమైనా.. ఇఫ్తికర్ అహ్మద్(27 బ్యాటింగ్) సాయంతో బాబర్ ఆజామ్(93 బ్యాటింగ్) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

Story first published: Wednesday, August 30, 2023, 17:57 [IST]
Other articles published on Aug 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+