Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెల్మెట్ లేకుండా ఏతులు కొడితే ఇలానే ఔటవుతారు: అశ్విన్

న్యూఢిల్లీ: బ్యాటింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు. తలకు గాయాలు కాకుండా రక్షణ ఇచ్చే హెల్మెట్.. కొన్ని పరిస్థితుల్లో ఔటయ్యే ప్రమాదం నుంచి కూడా కాపాడుతుందని చెప్పాడు. స్పిన్ బౌలింగ్‌లో హెల్మెట్ లేకుండా ఏతులు కొడుతామంటే పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌‌లా విచిత్రకర రీతిలో రనౌట్ కావాల్సి వస్తుందని హెచ్చరించాడు.

ఆసియాకప్ 2023లో భాగంగా నేపాల్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రిజ్వాన్(44) రనౌట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. బేసిక్ విషయం మరిచి మూల్యం చెల్లించుకున్నాడు. క్విక్ సింగిల్ తీసే ప్రయత్నంలో సమయానికి క్రీజుకు చేరినా.. బ్యాట్‌ను పెట్టలేకపోయాడు. పరుగు తీసేటప్పుడు బ్యాట్‌ను నేలకు తాకిస్తూ పరుగెత్తాలనే బేసిక్ విషయాన్ని మరిచి వికెట్ పారేసుకున్నాడు.

Mohammed Rizwan

మహమ్మద్ రిజ్వాన్ ఔటైన తీరుపై ట్విటర్ వేదికగా స్పందించిన రవిచంద్రన్ అశ్విన్.. హెల్మెట్ పెట్టుకోకపోవడమే అతని ఔట్‌కు కారణమైందని చెప్పాడు.

'ఫీల్డర్ త్రో యొక్క ఎత్తును బాబర్ ఆజామ్ తప్పించుకోలేకపోయాడు. సాధారణంగా వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు.. ఔటయ్యే పరిస్థితిని తప్పించుకునేందుకు బ్యాటర్లు డైవ్ చేస్తారు. అయితే ఇలా కవర్‌లో ఆడి ఔటవ్వడం చాలా అరుదు. హెల్మెట్ ధరించకపోవడంతోనే రిజ్వాన్ డైవ్ చేయలేకపోయాడు. స్పిన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడటం రిజ్వాన్‌కు ఇష్టం. స్పిన్ బౌలింగ్‌ కదా? అని హెల్మెట్ లేకుండా ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.'అని అశ్విన్ ట్వీట్ చేశాడు.

Ravichandran Ashwin

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఫకార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) దారుణంగా విఫలమయ్యారు. దాంతో పాక్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బాబర్ ఆజామ్, రిజ్వాన్ జట్టు‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు.

అఘా సల్మాన్(5) విఫలమైనా.. ఇఫ్తికర్ అహ్మద్(68 బ్యాటింగ్) సాయంతో బాబర్ ఆజామ్(125 బ్యాటింగ్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ నేపాల్ బౌలర్లపై విరుచుకుపడుతుండటంతో పాకిస్థాన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Story first published: Wednesday, August 30, 2023, 18:31 [IST]
Other articles published on Aug 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+