For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs NEP: పసికూనపై బాబర్ ఆజామ్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు!

ముల్తాన్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 19వ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజామ్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆసియాకప్ 2023‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజామ్.. 108 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.

102 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్ ఆజామ్ 19 సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను అధిగమించాడు. హాషీమ్ ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు నమోదు చేయగా.. విరాట్ కోహ్లీ 124, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.

 Babar Azam breaks Virat Kohli record

అంతేకాకుండా ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2014 ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా కోహ్లీ 136 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు మాత్రం విరాట్ కోహ్లీపైనే ఉంది.

2012 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 183 పరుగులు చేశాడు. అతని తర్వాత 151 పరుగులతో బాబర్ ఆజామ్ నిలిచాడు. ఇక సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. 2000 ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌పై కెప్టెన్‌గా గంగూలీ 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆజామ్ 15వ స్థానంలో నిలిచాడు.

ఈ క్రమంలో డేవిడ్ వార్నర్(19) సమం చేశాడు. సయిద్ అన్వర్ తర్వాత పాకిస్థాన్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు నమోదు చేసిన పాకిస్థాన్ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 151), ఇఫ్తికర్ అహ్మద్(71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ రెండు వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లామిచ్చనే తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Wednesday, August 30, 2023, 20:45 [IST]
Other articles published on Aug 30, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+