PAK vs ENG: స్టన్నింగ్ క్యాచ్! ఔటా.. నాటౌటా..?(వీడియో)
పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ వోక్స్.. బౌండరీ లైన్‌పై పట్టిన ఓ క్యాచ్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో ఈ చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో ఈ క్యాచ్ విషయంలో నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. సిక్సర్‌గా వెళ్లిన బంతిని బౌండరీ లైన్‌పై క్రిస్ వోక్స్ అద్భుతంగా అడ్డుకున్నాడు. సమన్వయం కోల్పోయినట్లు భావించిన అతను బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. క్రిస్ వోక్స్ విన్యాసానికి అందరూ ఫిదా అయ్యారు. స్టన్నింగ్ క్యాచ్‌తో బ్యాటర్‌ను ఔట్ చేశాడని సంబరపడ్డారు. కానీ థర్డ్ అంపైర్ షాకిచ్చాడు.

ఫీల్డ్ అంపైర్ల సమీక్ష కోరడంతో పలుమార్లు రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. తిరిగి వచ్చి బంతిని అందుకునే క్రమంలో క్రిస్ వోక్స్ కాలు బౌండరీ లైన్ బయట ఉందని గుర్తించి నాటౌటిచ్చాడు. అయితే థర్డ్ అంపైర్ తప్పిదం చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
పాకిస్థాన్@ 556
ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అబ్దుల్లా షఫీక్(184 బంతుల్లో 10 ఫోర్లతో 2 సిక్స్‌లతో 102), షాన్ మసూద్(177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151), సల్మాన్ అఘా(119 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 నాటౌట్) శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జాక్ లీచ్(3/160) మూడు వికెట్లు పడగొట్టాడు.
క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ తీసారు. అనంతరం ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(64 బంతుల్లో 11 ఫోర్లతో 64 బ్యాటింగ్), జో రూట్(54 బంతుల్లో 2 ఫోర్లతో 32 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్ ఓలీ పోప్(0) విఫలమయ్యాడు. నసీమ్ షాకు ఓ వికెట్ దక్కింది.
Chris Woakes you need to take catching masterclass from Suryakumar Yadav to take these kind of stunner on boundary.pic.twitter.com/KQYfLGceOK
— Sujeet Suman (@sujeetsuman1991) October 8, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications