Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs ENG తొలి టెస్ట్.. సెంచరీల మోత మోగినా.. పట్టించుకోని పాక్ ఫ్యాన్స్!

పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌‌కు ఆశించిన రీతిలో ప్రేక్షకాదరణ లభించడం లేదు. ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు సెంచరీల మోత మోగించినా.. ప్రేక్షకులు మైదానానికి రావడం లేదు. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకాదరణ లేకపోవడంపై మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మైక్ అథెర్టన్ ఖాళీ స్టేడియాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రేక్షకుల కంటే సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువగా ఉన్నారని సెటైర్లు పేల్చాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రేక్షకులు పట్టించుకోవడం షాకింగ్‌గా ఉందన్నాడు.

PAK vs ENG Shan Masood Century Fails to attract crowd in Multan Test

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం ఈ ఫార్మాట్‌పై పాకిస్థాన్ అభిమానులు అనాసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అబ్దుల్లా షఫీక్(184 బంతుల్లో 10 ఫోర్లతో 2 సిక్స్‌లతో 102), షాన్ మసూద్(177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151), సల్మాన్ అఘా(119 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 నాటౌట్) శతకాలతో రాణించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జాక్ లీచ్(3/160) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ తీసారు. అనంతరం ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(64 బంతుల్లో 11 ఫోర్లతో 64 బ్యాటింగ్), జో రూట్(54 బంతుల్లో 2 ఫోర్లతో 32 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్ ఓలీ పోప్(0) విఫలమయ్యాడు.

Story first published: Tuesday, October 8, 2024, 18:26 [IST]
Other articles published on Oct 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+