PAK vs ENG: ఒక్క రోజే 500 పరుగులా? ఇదేం పిచ్.. అదేం బ్యాటింగ్? టెస్ట్ క్రికెట్ నాశనానికే..!

రావల్పిండి: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(111 బంతుల్లో 21 ఫోర్లతో 122), బెన్ డక్కెట్(110 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఓలీ పాప్(104 బంతుల్లో 14 ఫోర్లతో 108), హరీ బ్రూక్(81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 బ్యాటింగ్) సైతం శతకాలు నమోదు చేశారు. టాప్-5 బ్యాటర్లలో నలుగురు సెంచరీలు నమోదు చేయడంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఇంగ్లండ్ బ్యాటింగ్ తీరు వన్డే క్రికెట్‌ను తలపించింది. చూస్తుంది టెస్ట్ మ్యాచా? లేక ధనాధన్ ఫార్మాటా? అని ఫ్యాన్స్ అయోమయానికి గురయ్యారు.
బజ్ బాల్ కాన్సెప్ట్‌తో..
టెస్ట్‌ల్లో బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో దూకుడు మంత్రాన్ని జపిస్తున్న ఇంగ్లీష్ టీమ్.. పాక్ గడ్డపై అదే జోరును కొనసాగించింది. జోరూట్(23) ఒక్కడే విఫలమవ్వగా.. ఇంగ్లండ్ బ్యాటర్ల జోరు ముందు పాక్ బౌలర్లు తేలిపోయారు. ఏ సెషన్‌లోనూ ప్రభావం చూపలేకపోయారు. జాహిద్ మహమూద్ రెండు వికెట్లు తీయగా.. హారీస్ రౌఫ్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు. క్రీజులో సెంచరీ హీరో హారీ బ్రూక్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(34 బ్యాటింగ్) ఉన్నాడు. రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో వేగంగా ఆడి ఇంగ్లండ్ డిక్లెర్ చేసే అవకాశం ఉంది. పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరిస్తున్న ఈ పిచ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా
నిస్సారమైన పిచ్ అంటూ..
నిస్సారమైన పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు పండుగ చేసుకోవడం జీర్ణించుకోలేని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాపై దుమ్మెత్తి పోస్తున్నారు. 'రమీజ్ రాజా టెస్టు క్రికెట్ ను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కామెంటేటర్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ పాకిస్తాన్ జట్టు మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుందని కామెంట్స్ చేసేవాడు. ఇప్పుడు పీసీబీ చీఫ్ అయ్యాక ప్రత్యర్థి జట్టు ఒకరోజులో 500 పరుగులు చేసేవిధంగా పిచ్ లు తయారుచేస్తున్నాడు..' అని మండిపడ్డారు.
పిచ్‌పై నిషేధం విధించాలి..
'నా దారి రహాదారి.. రమీజ్ రాజా', 'ఇదేం పిచ్ రా అయ్యా.. మరీ ఇంత అధ్వాన్నంగా ఉంది. బ్యాటర్లు పండుగ చేసుకోవడానికే దీనిని రూపొందించారా..?', 'అసలు ఏ దేశ క్రికెట్ అభిమాని కూడా ఇంత దరిద్రమైన పిచ్‌ను చూడాలనుకోడు. థ్యాంక్యూ రమీజ్ రాజా. టెస్టు క్రికెట్ ను నాశనం చేయాలన్న నీ ఆశయం నెరవేరుతున్నది.', 'ఓటమంటే అంత భయమా రమీజ్.. ఇంత నిస్సారమైన పిచ్ లు తయారుచేసి అబాసుపాలవ్వడం కంటే ఓడిపోవడమే బెటర్ కదా.'అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే రావల్పిండి పిచ్‌పై జీవితకాలం నిషేధం విధించి డీమెరిట్ పాయింట్లు కేటాయించాలని ఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నారు.
టెస్ట్ చరిత్రలోనే తొలిసారి...
అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు సైతం ఈ వికెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ మాజీ క్రికెటర్ టామ్ మూడీ స్పందిస్తూ.. 'పాకిస్తాన్ - ఇంగ్లండ్‌ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ అద్భుతంగా ఉంది.' సెటైర్ పేల్చాడు. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో ఆట తొలి రోజే 500 పరుగులు స్కోరు చేసిన తొలి టీమ్‌గా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో ఆస్ట్రేలియా చేసిన 494 పరుగుల రికార్డును ఇంగ్లండ్ బద్దలుకొట్టింది. 1910లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 494 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. ఇంగ్లండ్ అధిగమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications