For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: లాలిపాప్ క్యాచ్‌లు వదిలేసిన బాబర్ ఆజామ్.. ఫిక్సింగ్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్! (వీడియో)

PAK vs ENG: Pakistan captain Babar Azam brutally trolled as drops sitter in 7th T20 vs England

లాహోర్: కీలక టీ20 ప్రపంచకప్ ముందు దాయాదీ పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు టీ20ల సిరీస్‌ను 4-3 తేడాతో కోల్పోయింది. చెత్త ఫీల్డింగ్‌తోనే ఈ సిరీస్‌ను గెలవలేకపోయింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ నుంచి పాక్ ఆటగాళ్లంతా ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. మెగా టోర్నీ ముందు దాయాదీ ఆటగాళ్ల ఫీల్డింగ్ ఆ దేశ అభిమానులను కలవరపెడుతోంది.

ఆదివారం జరిగిన ఈ సిరీస్ ఫైనల్ గేమ్‌లో ఇంగ్లండ్ 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ చాలా చెత్తగా ఫీల్డింగ్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ రెండు సులువైన క్యాచ్‌లు నేలపాలు చేయగా.. మహమ్మద్ వసీమ్ ఒకటి వదిలేసాడు. దాంతో పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

రెండు లాలిపాప్ క్యాచ్‌లు..

కెప్టెన్ బాబర్ ఆజామ్ రెండు సులువైన క్యాచ్‌లను వదిలేసాడు. చేతులోకి వచ్చిన బంతిని అందుకోలేకపోయాడు. ఇఫ్తికర్ వేసిన 12 ఓవర్‌ ఐదో బంతికి ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్ పట్టుంటే బ్రూక్ 11 పరుగులకే వెనుదిరిగేవాడు. ఆ తర్వాత హ్యారీస్ రౌఫ్ వేసిన 16 ఓవర్‌లో మరోసారి హారీ బ్రూక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బాబర్ చేజార్చాడు. ఈ ఓవర్ మూడో బంతిని బ్రూక్ భారీ షాట్ కొట్టగా.. మిడాఫ్‌లో గాల్లోకి లేచింది.

అక్కడే ఫీల్డింగ్ చేసిన బాబర్.. అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్ పట్టినా బ్రూక్ ఇన్నింగ్స్ 26 పరుగులకే ముగిసేది. ఇక హ్యారీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతిని డేవిడ్ మలాన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ కావడంతో మిడ్ వికెట్‌లో గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న మమమ్మద్ వసీం అందుకోలేకపోయాడు.

అమ్ముడుపోయారు..

ఈ మూడు క్యాచ్‌లు వదిలేయడంతో పాటు పరుగులను ఆపడంలోనూ విఫలమయ్యారు. గతంలో పాక్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలనే మళ్లీ పునరావృతం చేస్తున్నారు. ఈ అవకాశాలతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేసారు. మూడు సులువైన క్యాచ్‌లు వదిలేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ పక్కా ఫిక్సింగ్ చేశారని, ముఖ్యంగా బాబర్ ఆజామ్ డబ్బులకు అమ్ముడుపోయాడంటూ మండిపడుతున్నారు. పీసీబీ వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత దారుణమైన ఫీల్డింగ్ ఎక్కడ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాబర్ క్యాచ్ డ్రాప్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

దంచికొట్టిన మలాన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హెర్రీ బ్రూక్(29 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాక్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 109 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ హస్నైన్ ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. మరో రెండు వికెట్లు రనౌట్ ద్వారా వచ్చాయి.

క్రిస్ వోక్స్ తీన్మార్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. పాక్ జట్టులో షాన్ మసూద్(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరడగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రిజ్వాన్(1), బాబర్ ఆజామ్(4) ఘోరంగా విఫలమవ్వడంతో పాక్‌కు పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లే రెండు వికెట్లు పడగొట్టాడు. రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్, సామ్ కరన్ చెరొక వికెట్ తీసారు.

Story first published: Monday, October 3, 2022, 8:08 [IST]
Other articles published on Oct 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+