సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 36 పరుగుల లక్ష్యాన్ని 3.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి చేధించి సునాయస విజయాన్నందుకుంది.
అంతకుముందు 24/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో 112 పరుగులకు కుప్పకూలింది. జోరూట్(33), హ్యారీ బ్రూక్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో నోమన్ అలీ(6/42), సాజిద్ ఖాన్(4/69) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. జామీ స్మిత్(119 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), బెన్ డక్కెట్(84 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్(6/128) ఆరు వికెట్లతో సత్తా చాటగా.. నోమన్ అలీ(3/88) మూడు వికెట్లు తీసాడు.
అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. సౌద్ షకీల్(223 బంతుల్లో 5 ఫోర్లతో 134) సెంచరీతో రాణించగా.. సాజిద్ ఖాన్(48 నాటౌట్), నోమన్ అలీ(45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్ మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌కు 77 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్ ఆ జట్టు విజయానికి బాటలు వేసింది.
ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన పాకిస్థాన్.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 267 ఆలౌట్
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 344 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 112 ఆలౌట్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 37/1