For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ బౌలర్లు.. 52 ఏళ్ల తర్వాత..!

సొంతగడ్డపై పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. 11 టెస్ట్‌ల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

పాకిస్థాన్ స్పిన్నర్లు నోమన్ అలీ, సజీద్ ఖాన్ 20 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ ఏడు వికెట్లు తీస్తే.. నోమన్ అలీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో నోమన్ అలీ 8 వికెట్లు తీస్తే.. సాజిద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

PAK vs ENG Noman Ali Sajid Khan Create History Becomes First Bowling Pair In 52 Years To picked all the 20 wickets in a Test match

52 ఏళ్ల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లే 20 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. 1972 యాషెస్ సిరీస్‌లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు డెన్నిస్ లిల్లీ, బాబ్ మాస్సీ తొలిసారి ఈ ఘనతను అందుకున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. యువ ప్లేయర్ కమ్రాన్ గులామ్(118) సెంచరీతో చెలరేగగా.. సయీమ్ ఆయుబ్(77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్‌లీచ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్(3/50) మూడు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డక్కెట్(114) ఒక్కడే సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో సాజిద్ ఖాన్(7/111) ఏడు వికెట్లు తీయగా.. నోమన్ అలీ(3/101) మూడు వికెట్లు పడగొట్టాడు.

75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 221 పరుగులు చేసింది. సల్మాన్ అఘా(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/66) నాలుగు, జాక్ లీచ్(3/67), బ్రైడన్ కార్స్(2/29) రెండు వికెట్లు పడగొట్టారు. 297 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 144 పరుగులకు కుప్పకూలింది.

సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 366 ఆలౌట్

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 291 ఆలౌట్

పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 221 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 144 ఆలౌట్

Story first published: Friday, October 18, 2024, 16:15 [IST]
Other articles published on Oct 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+