For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: దరిద్రం జేబులో ఉందంటే ఇదేనేమో.. విచిత్రకర రీతిలో బెన్‌స్టోక్స్ ఔట్!(వీడియో)

ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ స్టంపౌటయ్యాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ బౌలింగ్‌లో స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన బెన్ స్టోక్స్.. బ్యాట్ చేజారి ఔటయ్యాడు. చేతిలో నుంచి బ్యాట్ చేజారి దూరంగా పడటంతో బెన్ స్టోక్స్ తిరిగి క్రీజులో పెట్టలేకపోయాడు.

బంతిని అందుకున్న వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఎలాంటి తప్పిదం చేయకుండా స్టంపౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. అయ్యో పాపం బెన్ స్టోక్స్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 36 బంతుల్లో 4 ఫోర్లతో 37 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 144 పరుగులకు కుప్పకూలింది. దాంతో పాకిస్థాన్ 152 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

PAK vs ENG England skipper Ben Stokes loses bat and gets stumped in 2nd Test against Pakistan

దాంతో 1338 రోజుల నిరీక్షణ తర్వాత పాకిస్థాన్ సొంతగడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. యువ ప్లేయర్ కమ్రాన్ గులామ్(118) సెంచరీతో చెలరేగగా.. సయీమ్ ఆయుబ్(77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్‌లీచ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్(3/50) మూడు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డక్కెట్(114) ఒక్కడే సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో సాజిద్ ఖాన్(7/111) ఏడు వికెట్లు తీయగా.. నోమన్ అలీ(3/101) మూడు వికెట్లు పడగొట్టాడు.

75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 221 పరుగులు చేసింది. సల్మాన్ అఘా(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/66) నాలుగు, జాక్ లీచ్(3/67), బ్రైడన్ కార్స్(2/29) రెండు వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 366 ఆలౌట్

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 291 ఆలౌట్

పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 221 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 144 ఆలౌట్

Story first published: Friday, October 18, 2024, 13:30 [IST]
Other articles published on Oct 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+