PAK vs ENG: పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు తీవ్ర అస్వస్థత.. టెస్ట్ సిరీస్ రద్దు!

అహ్మదాబాద్: టెస్ట్ సిరీస్ కోసం 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టుకు అనౌన్ వైరస్ సోకింది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా 14 మంది ఆటగాళ్లు ఈ వైరస్ బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. హరీ బ్రూక్, జాక్ క్రాలీ, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా ఈ అనౌన్ వైరస్ బారిన పడ్డారు.
మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి జరగనున్న తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు అక్కడికి వెళ్లింది. ఆటగాళ్ల అస్వస్థతకు గురవ్వడంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అటు పీసీబీ కానీ.. ఇటీ ఈసీబీ కానీ ఈ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

తొలి టెస్ట్‌పై నీలినీడలు..
మరో 24 గంటల వ్యవధిలోనే ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇంగ్లండ్ జట్టులోని 14 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురవ్వడంతో ఈ మ్యాచ్ జరగడం కష్టంగా మారింది. ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు కనీస 11 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేరు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లను హోటల్ గదులకే పరిమితం కావాలని సూచించినట్లు పాక్ మీడియా పేర్కొంది. ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో గుర్తు తెలియని వైరస్ బారిన పడిన ఇంగ్లండ్ ఆటగాళ్లు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రాణాంతక వైరస్ అయితే..
పాకిస్థాన్ సైతం ఈ కొత్త వైరస్ పట్ల వణికిపోతుంది. అసలే అంతర్గత రాజకీయాలు, వరదలతో ఆర్థికంగా దెబ్బ తిన్న ఆ దేశం.. కొత్త వైరస్ తమ దేశంలో బయటపడటంతో ఆందోళనకు గురవుతోంది. అంతర్జాతీయ సమాజం తమ దేశంపై ఆంక్షలు విధిస్తే ఎలా అని భయపడుతోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు సోకిన వైరస్ కరోనాలా ప్రాణాంతకమైతే.. అంతర్జాతీయంగా పాక్‌పై కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఆ దేశానికి రాకపోకలు కూడా బంద్ చేయనున్నారు. అయితే ఆ వైరస్ ప్రమాదకరమా? కదా? అనేది తెలియాల్సి ఉంది.

17 ఏళ్ల తర్వాత అడుగుపెడితే..
సుమారు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్.. పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు పాకిస్థాన్ వెళ్లి 7 టీ20ల సిరీస్‌ను 4-3తో గెలిచి వచ్చిన ఇంగ్లండ్.. వరల్డ్ కప్ తర్వాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు మళ్లీ పాక్‌కు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో, మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరగనున్నాయి. ఒకవేళ వైరస్ ప్రాణాంతకమైతే ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంది.

బెన్ స్టోక్స్ భారీ విరాళం..
కాగా.. ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో తలపడిన విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది సెమీస్‌కు చేరిన ఈ రెండు జట్లు.. న్యూజిలాండ్, ఇండియాను ఓడించి ఫైనల్లోపోటీ పడ్డాయి. 2019 వన్డే వరల్డ్ కప్‌లో విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన బెన్ స్టోక్స్.. పాక్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. ఇంగ్లండ్‌కు రెండో టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఫైనల్లో పాక్‌ను ఓడించి ఆ జట్టు అభిమానుల మనసులు గాయపరిచి స్టోక్స్.. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్ ద్వారా వచ్చే మ్యాచ్ ఫీజును పాక్ వరద బాధితుల సహాయర్థం విరాళం ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications