For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs CAN: టాస్ గెలిచిన బాబర్ ఆజామ్.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పు!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కెనడాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఉదయం మ్యాచ్ కావడంతో పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. తొలి 6 ఓవర్లను మాకు అనుకూలంగా మార్చుకుంటాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. సయీమ్ ఆయుబ్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ గురించి మేం సుదీర్ఘంగా చర్చించాం. ఈ మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. మాకు మరో ఆప్షన్ లేదు. కెనడా జట్టులోని కొందరి బౌలర్లను నేను ఇప్పటికే ఆడాను.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

PAK vs CAN T20 World Cup 2024 Babar Azam wins toss opt to bowl first

సయీమ్ ఆయుబ్ రాకతో ఇఫ్తికర్ అహ్మద్‌పై వేటు పడింది. మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అన్నాడు.

'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ ఛేజింగ్‌లో చాలా జట్లు ఇబ్బంది పడటం చూశాం. మేం కూడా పోరాడే లక్ష్యాన్ని నమోదు చేస్తామని ఆశిస్తున్నా. జట్టులో ఒక మార్పు చేశాం. ఈ టోర్నీలో మేం గుడ్ క్రికెట్ ఆడాం. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. పాకిస్థాన్‌కు ఇది డూ ఆర్‌ డై మ్యాచ్ అనే విషయం తెలుసు. ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. భారీ లక్ష్యం నమోదు చేసి వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టుతాం.'అని బ సాద్ బిన్ జఫర్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

కెనడా: ఆరోన్ జాన్సన్, నవ్‌నీత్ ధలివాల్, పర్గాట్ సింఘ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ, రవీందర్‌పాల్ సింగ్, డిల్లన్, హేలిగర్, కలీమ్ సానా, జునైద్ సిద్దికీ, జెరెమీ గోర్డోన్

పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్(కీపర్), సయీమ్ ఆయూబ్, బాబర్ ఆజామ్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ అమీర్

Story first published: Tuesday, June 11, 2024, 20:25 [IST]
Other articles published on Jun 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+