Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: ఖాతా తెరిచిన పాకిస్థాన్.. కెనడాపై ఘన విజయం!

టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా రెండు పరాజయాల అనంతరం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి ఆశించిన ఫలితాన్ని అందుకుంది. కెనడాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 106 పరుగులు చేసింది. కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సాద్ బిన్ జఫర్(21 బంతుల్లో ఫోర్‌తో 10), కలీమ్ సనా(14 బంతుల్లో సిక్స్‌తో 13 నాటౌట్) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Pakistan bounce back in New York

పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్(2/13), హ్యారీస్ రౌఫ్(2/26) నిప్పులు చెరగగా.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మహమ్మద్ రిజ్వాన్(53 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఓపెనర్ సయీమ్ ఆయుబ్(6) దారుణంగా విఫలమవ్వగా.. బాబర్ ఆజామ్, రిజ్వాన్ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. బాబర్ ఆజామ్(33), ఫకార్ జమాన్(4) ఔటైనా.. ఉస్మాన్ ఖాన్(2 నాటౌట్0 సాయంతో రిజ్వాన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కెనడా బౌలర్లలో జెరెమీ గోర్డన్ ఓ వికెట్ తీయగా.. డిలన్ హైలర్(2/18) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, June 11, 2024, 23:34 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+