Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs CAN: హాఫ్ సెంచరీతో కెనడా ఓపెనర్ ఒంటరి పోరాటం!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కెనడా 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నమోదు చేసింది. న్యూయార్క్‌లో నాసౌ కౌంటీ క్రికెట్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 106 పరుగులు చేసింది.

కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సాద్ బిన్ జఫర్(21 బంతుల్లో ఫోర్‌తో 10), కలీమ్ సనా(14 బంతుల్లో సిక్స్‌తో 13 నాటౌట్) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

PAK vs CAN Aaron Johnson hits fifty before Pakistan restrict Canada to 106 7

పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్(2/13), హ్యారీస్ రౌఫ్(2/26) నిప్పులు చెరగగా.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పాక్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కెనడా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు ఓపెనర్ ఆరోన్ జాన్సన్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన అతన్ని నసీమ్ షా క్లీన్ బౌల్డ్ చేయడంతో 6వ వికెట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Tuesday, June 11, 2024, 22:20 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+