For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN: షాహిన్ అఫ్రిదిపై వేటు.. బంగ్లాతో రెండో టెస్ట్ ఆడే పాకిస్థాన్ జట్టు ఇదే!

బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న పాకిస్థాన్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి రావల్పిండి వేదికగానే ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇదే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్‌తో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్ కాపాడుకోవాలంటే చివరి మ్యాచ్ గెలవడం పాకిస్థాన్‌కు కీలకం.
తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ టీమ్.. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌కు రెడీ అవుతోంది. ఒక రోజు ముందుగానే రెండో టెస్ట్‌లో బరిలోకి దిగే 12 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది.

PAK vs BAN Why did Pakistan team management leave out Shaheen Afridi from 2nd test against Bangladesh

అందరూ ఊహించినట్లుగానే షాహిన్ అఫ్రిదిని రెండో టెస్ట్‌ నుంచి తప్పించారు. ఇటీవలే తండ్రి అయిన అతనికి ఫ్యామిలీతో గడిపేందుకు రెస్ట్ ఇచ్చామని పాకిస్థాన్ కోచ్ జాసన్ గిలెస్పీ వివరణ ఇచ్చాడు. '12 మంది సభ్యులతో కూడిన జట్టులో అబ్రార్ అహ్మద్‌ను తీసుకున్నాం. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు జట్టును ఎంపిక చేశాం. రేపటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత తుది జట్టును ఎంపిక చేస్తాం.

షాహిన్ అఫ్రిది మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాడు. ఇటీవలే అతను తండ్రి అయ్యాడు. ఫ్యామిలీతో గడిపేందుకు అతనికి సమయం ఇవ్వాలనుకున్నాం. అందుకే రెండో టెస్ట్‌కు దూరంగా ఉంచాం.'అని మీడియా సమావేశంలో గిలెస్పీ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ బౌలింగ్ యూనిట్‌లో షాహన్ అఫ్రిది కీలక బౌలర్. అతని గైర్హాజరీతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారనుంది. అతను బంతిని అద్బుతంగా స్వింగ్ చేయగలడు.

అయితే ఫ్యామిలీతో గడిపేందుకే షాహిన్ అఫ్రిదికి రెస్ట్ ఇచ్చామని గిలెస్సీ చెబుతున్నా.. కావాలనే తప్పించారనే వాదన వినిపిస్తోంది. టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్‌, షాహిన్ అఫ్రిది మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, తొలి టెస్ట్ సందర్భంగా ఇవి బయటపడ్డాయనే వాదన వినిపిస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో షాహిన్ షా అఫ్రిదిపై పీసీబీ వేటు వేసిందని పాకిస్థాన్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తొలి టెస్ట్ సందర్భంగా.. షాన్ మసూద్ పెప్ టాక్ సందర్భంగా షాహిన్ అఫ్రిది భుజంపై చేతి వేయగా.. అతను తీసేయడం టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో పాకిస్థాన్ జట్టులోని గ్రూప్ రాజకీయాలను బయటపెట్టిందని పాకిస్థాన్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, సయీమ్ ఆయుబ్, షాన్ మసూద్, బాబర్ ఆజామ్, సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్(కీపర్), సల్మాన్ అలీ అఘా, ఖుర్రమ్ షెహ్‌జాద్, మహమ్మద్ అలీ, అబ్రర్ అహ్మద్, నసీమ్ షా, మిర్ హంజా

Story first published: Thursday, August 29, 2024, 16:41 [IST]
Other articles published on Aug 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+