Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs BAN: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. బంగ్లాదేశ్ విల విల (వీడియో)

లాహోర్: ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ పేస్ త్రయం షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ మరోసారి నిప్పులు చెరిగారు. పాక్ పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ టాపార్డర్ కుప్పకూలింది. 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

తన తొలి ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్ మెహ్‌దీ హసన్ మీరాజ్(0)ను నసీమ్ షా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీతో మెహ్‌దీ హసన్‌ను బోల్తా కొట్టించాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెహ్‌దీ హసన్.. ఈ మ్యాచ్‌లో నసీమ్ షా ధాటికి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

PAK vs BAN: Pakistan pacers rattle Bangladesh innings in Asia Cup 2023 supers 4s

క్రీజులోకి వచ్చిన లిటన్ ధాస్ బౌండరీలతో పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. కానీ అతని జోరుకు షాహిన్ అఫ్రిది అడ్డుకట్టవేసాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆచితూచి ఆడుతున్న మహమ్మద్‌ నైమ్(20)ను హ్యారీస్ రౌఫ్ పెవిలియన్ చేర్చాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి రిట్నర్ క్యాచ్‌గా వెనక్కి పంపించాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్‌లో టౌహిడ్ హృదయ్(2)‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఆచితూచి ఆడుతున్నారు. ఇద్దరూ 83 ప్లస్ పరుగుల భాగస్వామ్యంతో హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు.

PAK vs BAN: Pakistan pacers rattle Bangladesh innings in Asia Cup 2023 supers 4s

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లో షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌తో గత మ్యాచ్‌లో రాణించినట్లే ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలనుకుంటున్నామని టాస్ సందర్భంగా షకీబ్ తెలిపాడు. పాకిస్థాన్ బలహీనత తమకు తెలుసని, దానిపై దెబ్బకొడుతామని చెప్పాడు.

తాను టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాడినని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. అయితే పిచ్‌పై కొంత పచ్చదనం ఉందని, దాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

Story first published: Wednesday, September 6, 2023, 17:21 [IST]
Other articles published on Sep 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+