Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs BAN: నిప్పులు చెరిగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన బంగ్లాదేశ్!

PAK vs BAN: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు దుమ్మురేపారు. షాహిన్ అఫ్రిది(3/23), మహమ్మద్ వసీమ్(3/31) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది.

మహ్మదుల్లా(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(64 బంతుల్లో 6 ఫోర్లతో 45), షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 4 ఫోర్లతో 43) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్‌ మూడేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ తలో వికెట్ తీసారు.

 PAK vs BAN: Mohammed Wasim, Shaheen Sha Afridi help Pakistan bowl Bangladesh out for 204

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. షాహిన్ అఫ్రిది వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే బంగ్లా ఓపెనర్ తన్జిత్ హసన్(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో బంగ్లాదేశ్ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. తన మరుసటి ఓవర్‌లో నజ్ముల్ హోస్సెన్ షాంటో(4)ను షాహిన్ అఫ్రిది క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

ముష్పికర్ రహీమ్(5)‌ను హ్యారీస్ రౌఫ్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో లిటన్ దాస్, మహ్మదుల్లా జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించిన అనంతరం లిటన్ దాస్‌ను ఇఫ్తికర్ అహ్మద్ ఔట్ చేశాడు.

దాంతో అతను హాఫ్ సెంచరీ చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మహ్మదుల్లాను షాహిన్ అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లాదేశ్ పతనం మొదలైంది. టౌహిడ్ హృదయ్‌ను ఉసామా మిర్ ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన షకీబ్ అల్ హసన్(43) హ్యారీస్ రౌఫ్ పెవిలియన్ చేర్చాడు.

మెహ్‌దీ హసన్ మిరాజ్(25) విలువైన పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 200 పరుగుల మార్క్‌ను చేరుకోగలిగింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను మహ్మద్ వసీమ్ ఔట్ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Story first published: Tuesday, October 31, 2023, 18:24 [IST]
Other articles published on Oct 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+