For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN:వారెవ్వా రిజ్వాన్.. వాటే క్యాచ్! (వీడియో)

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్‌లో 171 పరుగులతో సత్తా చాటిన రిజ్వాన్.. వికెట్ కీపింగ్‌లోనూ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహమ్మద్ రిజ్వాన్ స్టన్నింగ్ క్యాచ్‌‌కు బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్(12) వెనుదిరిగాడు.

మూడో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో నసీమ్ షా వేసిన 27వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ చివరి బంతిని నసీమ్ షా.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా ఎడ్జ్ తీసుకున్న బంతి.. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్, వికెట్ కీపర్ మధ్యలో నుంచి దూసుకెళ్లింది. రిజ్వాన్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు బ్యాటర్‌తో పాటు ఫీల్డర్లు కామెంటేటర్లు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు.

PAK vs BAN Mohammad Rizwan Takes Flying Stunner against Bangladesh

కామెంటేటర్స్ గట్టిగా అరుస్తూ రిజ్వాన్‌ను కొనియాడారు. ఆపదలో ఆదుకునే వ్యక్తి రిజ్వాన్.. మరోసారి స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వారెవ్వా వాటే క్యాచ్ అంటూ నెటిజన్లు కూడా రిజ్వాన్‌ను మెచ్చుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 113 ఓవర్లలో 6 వికెట్లకు 448 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. సౌద్ షకీల్(141), మహమ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో రాణించగా.. సైమ్ ఆయుబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సౌద్ షకీల్, రిజ్వాన్ ఆదుకున్నారు.

ఐదో వికెట్‌కు 240 పరుగులు జోడించారు. రిజ్వాన్ డబుల్ సెంచరీ చేయకుండానే పాకిస్థాన్ డిక్లేర్ చేయడం విమర్శలకు దారి తీసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 53 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఓపెనర్ షెడ్‌మన్ ఇస్లామ్(48 బ్యాటింగ్), మోమినల్ హక్(31బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, August 23, 2024, 13:35 [IST]
Other articles published on Aug 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+