
క్రిస్టన్‌చర్చ్: పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 నాటౌట్) మరోసారి దుమ్మురేపాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో ఈ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ చెలరేగాడు. న్యూజిలాంగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. రిజ్వాన్ సూపర్ బ్యాటింగ్‌కు బౌలర్లు కూడా అండగా నిలవడంతో పాకిస్థాన్ 21 పరుగుల తేడాతో గెలిసి ముక్కోణపు సిరీస్‌లో బోణీ కొట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. రిజ్వాన్‌కు తోడుగా.. షాన్ మసూద్(31), బాబర్ ఆజామ్(22) రాణించారు. పాక్ మిడిలార్డర్ మరోసారి విఫలమవ్వగా... రిజ్వాన్ ఒక్కడే ఆఖరి వరకు ఉండి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. హసన్ మహముద్, నాసుమ్ అహ్మద్, మెహిదీ హసన్ మీర్జా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. బంగ్లాదేశ్‌లో యాసిర్ అలీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. లిటన్ ధాస్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), అఫిఫ్ హోస్సెన్(23 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 25) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీమ్(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. షాన్‌వాజ్ దహాని, హారీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ రిజ్వాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తన కూతురు పుట్టిన రోజు(అక్టోబర్ 7)న రిజ్వాన్ పాక్‌ను గెలిపించి బర్త్‌డే గిఫ్ట్ అందించాడు. మ్యాచ్ అనంతరం కూతురితో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఒక్కో జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు అక్టోబర్ 14న ఫైనల్‌లో తలపడుతాయి.