For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN: దారుణం.. మైదాన సిబ్బందిగా మారిన పాక్ ఆటగాళ్లు!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దయనీయ స్థితి మరోసారి బయట పడింది. మైదానాలను సిద్దం చేసేందుకు కావాల్సిన కనీస గ్రౌండ్స్‌మెన్ కూడా లేరనే విషయం తాజాగా స్పష్టమైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ బుధవారం(ఆగస్ట్ 21)తెర లేవనుంది. రావల్పిండి వేదికగా ప్రారంభం కావాల్సిన తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

దాంతో ఇంకా మ్యాచ్ ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఇంకా టాస్ వేయలేదు. మరోవైపు మైదానాన్ని సిద్దం చేసేందుకు కావాల్సిన గ్రౌండ్స్‌మెన్ లేకపోవడంతో.. పాకిస్థాన్ ఆటగాళ్లే రంగంలోకి దిగారు. గ్రౌండ్స్‌మెన్‌లా మైదానాన్ని సిద్దం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

PAK vs BAN Fans slams PCB after Pakistan s international players doing ground staff work

సరిపోని గ్రౌండ్స్‌మెన్‌ను కూడా నియమించలేని పీసీబీ.. ఛాంపియన్స్ ట్రోఫీని ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లు మైదానాన్ని సిద్దం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పీసీబీ.. బీసీసీఐని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు ప్రారంభా కావాల్సిన తొలి టెస్ట్.. వర్షం కారణంగా ఇంకా మొదలవ్వలేదు.

కాసేపటి క్రితమే మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేసి.. 2.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభిస్తామని తెలిపారు. 90 ఓవర్ల తొలి రోజు ఆటను 48 ఓవర్లకు కుదించారు. సాయంత్ర 6 గంటల వరకు మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 30 నిమిషాలు పొడిగించారు. ఇక మైదానంలో సీట్లు సరిగ్గా లేకపోవడంతో.. పెళ్లిలు, ఫంక్షన్లకు ఉపయోగించే కుర్చీలను వేసారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Story first published: Wednesday, August 21, 2024, 14:04 [IST]
Other articles published on Aug 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+