For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN: బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

PAK vs BAN: వన్డే ప్రపంచకప్ 2023‌లో పరాజయాల పరంపరకు పాకిస్థాన్ ముగింపు పలికింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత విజయాన్నందుకుంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

బౌలింగ్‌లో షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీమ్ సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఫకార్ జమాన్ సత్తా చాటి పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో పాకిస్థాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో పాకిస్థాన్.. పాయింట్స్ టేబుల్‌లో అఫ్గాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానంలో నిలిచింది.

మరోవైపు ఈ ఓటమితో బంగ్లాదేశ్.. సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో 6 ఓడిన బంగ్లాదేశ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరలేదు.

 PAK vs BAN: Fakhar Zaman and Abdullah Shafique help Pakistan beat Bangladesh by 7 wickets in CWC 2023

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(64 బంతుల్లో 6 ఫోర్లతో 45), షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 4 ఫోర్లతో 43) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్‌ మూడేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసి 105 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఫకార్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీహసన్ మీరాజ్(3/60) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

205 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఫకార్, షఫీక్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ నెమ్మదిగా ఆడినా.. ఫకార్ జమాన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ముందు షఫీక్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఫకార్ జమాన్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. బంగ్లా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించిన అనంతరం అబ్దుల్లా షఫీక్ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్(9) తీవ్రంగా నిరాశపరిచినా.. మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఫకార్ జమాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న షకార్ జమాన్‌ను మిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్(17) సాయంతో మహమ్మద్ రిజ్వాన్(26 నాటౌట్) పాక్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Tuesday, October 31, 2023, 20:48 [IST]
Other articles published on Oct 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+