Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: నీ బొమ్మ తిరగబడిందిరా ఆజాము!

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 22 పరుగులు మాత్రమే చేసిన బాబర్ ఆజామ్.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే వెనుదిరిగాడు.

స్పిన్ బౌలింగ్‌ ఆడటంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన బాబర్ ఆజామ్.. అదే స్పిన్ బౌలింగ్‌కు విలవిలలాడుతున్నాడు. వరుసగా స్పిన్ ఉచ్చులో చిక్కుకొని ఔటయ్యాడు. రెండో టెస్ట్‌లోనూ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బ్యాటింగ్ చేసినంత సేపు చాలా ఒత్తిడిలో కనిపించాడు.

PAK vs BAN Babar Azam s poor form continues 15 Innings 0 fifties

పాకిస్థాన్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్‌గా ఓ వెలుగు వెలిగిన బాబర్ ఆజామ్.. ఓ దశలో కోహ్లీతో పోటీపడ్డాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా అతను దారుణంగా విఫలమవుతున్నాడు. ఆటలో నిలకడ లోపించింది.టెస్ట్ క్రికెట్‌లో అతను హాఫ్ సెంచరీ చేయక 20 నెలలు అవుతోంది. 2022లో డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 161 పరుగులు చేశాడు.

అప్పటి నుంచి మరో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. ఈ 20 నెలల సమయంలో 15 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ ఆజామ్ అత్యధిక స్కోర్ 41 మాత్రమే. 21.33 సగటుతో 320 పరుగులు మాత్రమే చేశాడు. ఇవే గణంకాలు జట్టులో మరే ఆటగాడికి ఉన్నా.. అతను ఎప్పుడో చోటు కోల్పోయేవాడు.
కనీసం రెండో టెస్ట్‌లోనైనా సెంచరీతో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ బాబర్ ఆజామ్‌కు సూచిస్తున్నారు. కొందరైతే 'నీ బొమ్మ తిరగబడిందిరా ఆజామూ'అని అతని డౌన్ ఫాల్‌ను అభివర్ణిస్తున్నారు.

రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయుబ్(110 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), షాన్ మసూద్(69 బంతుల్లో 2 ఫోర్లతో 57), సల్మాన్ అఘా(95 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.

మెహ్‌దీ హసన్(5/61) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 193 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్న లిటన్ దాస్(90 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతుండగా.. హసన్ మహముద్ అతనికి సహకరిస్తున్నాడు.

Story first published: Sunday, September 1, 2024, 16:27 [IST]
Other articles published on Sep 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+