For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs BAN: మళ్లీ విఫలమైన బాబర్ ఆజామ్.. ఓటమి దిశగా పాకిస్థాన్! (వీడియో)

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసి షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగిన బాబర్ ఆజామ్.. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులే చేసి ఔటయ్యాడు. నహిద్ రాణా బౌలింగ్‌లో షేడ్‌మన్ ఇస్లామ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

టెస్ట్ క్రికెట్‌లో బాబర్ ఆజామ్ హాఫ్ సెంచరీ చేయక 20 నెలలు అవుతోంది. 2022లో డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మరో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. ఈ 20 నెలల సమయంలో 16 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ ఆజామ్ అత్యధిక స్కోర్ 41 మాత్రమే. 331 పరుగులు మాత్రమే చేశాడు.

PAK vs BAN Babar Azam Flops Again As Pakistan Slips Into Big Trouble Vs Bangladesh in 2nd Test

బాబర్ ఆజామ్ వైఫల్యంతో పాకిస్థాన్ ఓటమి దిశగా సాగుతోంది. 12 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో మహమ్మద్ రిజ్వాన్(32 బ్యాటింగ్), సల్మాన్ అఘా(4 బ్యాటింగ్) ఉన్నారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. టస్కిన్ అహ్మద్ ఒకటి, హసన్ మహముద్ రెండు వికెట్లు తీసారు.

ప్రస్తుతం పాకిస్థాన్ ఆధిక్యం 120 పరుగులకు చేరగా.. చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. 160 పరుగుల్లోపు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేస్తే మ్యాచ్‌పై బంగ్లాదేశ్‌ పట్టు బిగుస్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయుబ్(110 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), షాన్ మసూద్(69 బంతుల్లో 2 ఫోర్లతో 57), సల్మాన్ అఘా(95 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. మెహ్‌దీ హసన్(5/61) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. లిటన్ దాస్(138) సెంచరీతో.. మెహ్‌దీ హసన్ మీరాజ్(78) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును అసాధారణ బ్యాటంగ్‌తో లిటన్ దాస్ ఆదుకున్నాడు.

Story first published: Monday, September 2, 2024, 12:49 [IST]
Other articles published on Sep 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+