Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AUS Semifinal: టాస్ ఓడిన బాబర్ ఆజామ్.. భారత్‌కు పట్టిన గతే పాక్‌కు పట్టనుందా?

PAK vs AUS Semifinal, T20 WC 2021: Unchanged Australia opt to bowl against confident Pakistan

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్-2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ వికెట్ చేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, మంచు ప్రభావం కూడా ఉండనున్న నేపథ్యంలోనే చేజింగ్‌కు మొగ్గు చూపానని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఇక గత మ్యాచ్‌ల మాదిరే ఈ పిచ్ కూడా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని భావిస్తున్నానమని తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నామని ఫించ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆస్ట్రేలియా ముందు భారీ స్కోర్‌ను ఉంచడానికి ప్రయత్నిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఈ కీలక మ్యాచ్‌లో జట్టుకు సారథిగా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, యూఏఈ తమ సొంతగడ్డ లాంటిదని, ఇక్కడి పరిస్థితులు తమకు బాగా తెలుసున్నాడు. భారీ స్కోర్ చేసి దాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని బాబర్ తెలిపాడు. ఇక ఐసీసీ నౌకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను ఓడించిన చరిత్ర పాకిస్థాన్‌కు లేదు. పైగా ఈ దుబాయ్ పిచ్‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచిన దాఖలాలు కూడా లేవు. ఇదే వికెట్‌పై భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్‌లు జరగ్గా.. ఫీల్డింగ్ చేసిన జట్లనే విజయం వరించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన రెండు జట్లు పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. అంతేకాకుండా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో ముందు బ్యాటింగ్ చేసిన జట్లు చిన్నదేశాలపై గెలిచాయి తప్పా.. పెద్ద జట్లపై మాత్రం విజయాన్నందుకోలేకపోయాయి. వెస్టిండీస్-ఇంగ్లండ్, భారత్-పాకిస్థాన్, పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో టాస్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో ఈ క్రమంలోనే కీలక మ్యాచ్‌ల్లో టాస్ ఓడి మూల్యం చెల్లించుకున్న భారత్‌ గతే పాకిస్థాన్‌కు పట్టనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరీ పాకిస్థాన్ ఏం చేస్తుందో చూడాలి.

తుదిజట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ జంపా, జోష్ హెజల్ వుడ్

పాకిస్థాన్: బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్

Story first published: Thursday, November 11, 2021, 19:32 [IST]
Other articles published on Nov 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+