PAK vs AUS: మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాళ్లకు ఘోర అవమానం ఎదురైంది. డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. విమానాశ్రయంలో దిగిన పాకిస్థాన్ ఆటగాళ్లకు ఎలాంటి స్వాగతం లభించలేదు.
పాకిస్థాన్ దౌత్య అధికారులు గానీ, క్రికెట్ ఆస్ట్రేలియా అఫిషియల్స్ గానీ పాకిస్థాన్ జట్టుకు స్వాగతం పలకలేదు. కనీసం వారి లగేజీని తీసుకెళ్లే సిబ్బంది కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో ఆటగాళ్లే తమ లగేజీని మోసుకున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ లగేజీని ట్రక్ వ్యాన్‌ల్లోకి ఎక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

తమ దేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలకడం ఆతిథ్య క్రికెట్ బోర్డు కనీస కర్తవ్యం. కానీ పాకిస్థాన్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా లైట్ తీస్కోంది. ఈ వ్యవహారంపై క్రికెట్ అభిమానులతో పాటు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాకు విజయ గర్వం తలకెక్కిందని మండిపడుతున్నారు.
ఆతిథ్య దేశాలను అవమానించడం క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి కాదని, గతంలోనూ టాప్ టీమ్స్‌కు కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేక అభిమానుల ఆగ్రహానికి గురైందని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంది. టీమిండియా 2021 పర్యటనలోనూ గబ్బా టెస్ట్ సమయంలో ఇలానే ప్రవర్తించిందనే వార్తలు వచ్చాయి. ఆటగాళ్లకు ఇష్టమైన ఆహారం ఏర్పాటు చేయకుండా పాచిపోయింది పెట్టిందని, భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లంచ్‌ను బైకాట్ చేసి బయట హోటల్లో తిన్నారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కాగా.. క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు కోరింది. తాజాగా పాకిస్థాన్ ఆటగాళ్లను అదే తరహాలో ట్రీట్ చేసి తమ బుద్దిని చాటుకుంది.
ప్రస్తుతం భారత్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా టీమ్.. డిసెంబర్ 3(ఆదివారం) చివరి మ్యాచ్ ఆడే స్వదేశం పయనం కానుంది. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో రెండో టెస్ట్.. జనవరి 3న సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ ఆడనుంది.