Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AUS: చెలరేగిన ఫకార్, రిజ్వాన్.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం!

Mohammad Rizwan 67

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఆస్ట్రేలియా ముందు పాకిస్థాన్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. రిజ్వాన్, ఫకార్ జమాన్ హాఫ్ సెంచరీలకు తోడుగా కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) రాణించాడు. ఆరంభం నుంచి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన పాక్ బ్యాట్స్‌మన్ ప్రత్యర్థి ముందు టఫ్ టార్గెట్ ఉంచారు. ఇక పాక్ బ్యాట్స్‌మన్ ధాటికి లయ తప్పిన ఆసీస్ బౌలర్లు.. చివర్లో కట్టడిగా బౌలింగ్ చేసి భారీ స్కోర్‌ను అడ్డుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. అయితే పవర్ ప్లేలోనే రిజ్వాన్ ఇచ్చిన రెండు కష్టతరమైన క్యాచ్‌‌లను డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాలను నేలపాలు చేశారు. ఈ అవకాశాలను అందుకున్న రిజ్వాన్ చెలరేగాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టాడు. దాంతో పాక్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 47 రన్స్ చేసింది. ఈ టోర్నీలో పాక్‌కు ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.

అనంతరం ఆడమ్ జంపాను రంగంలోకి దింపిన ఫించ్.. పాక్ జోరును అడ్డుకున్నాడు. అతను తన వరుస ఓవర్లలో పాక్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టడంతో పరుగుల వేగం తగ్గింది. దాంతో ఒత్తిడికి గురైన బాబర్ ఆజామ్ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో డేవిడ్ వార్నర్‌కు చిక్కాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి ఫకార్ జమాన్ రాగా.. రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతులను బౌండరీకి తరలించాడు. ఇక క్రీజులో సెట్ అవ్వడానికి ఫకార్ జమాన్ టైమ్ తీసుకోగా.. మరోవైపు రిజ్వాన్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలోనే రిజ్వాన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హజెల్ వుడ్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్ రెండు సిక్స్‌లు బాదగా 21 రన్స్ వచ్చాయి. అదే జోరులో స్టార్క్ వేసిన మరుసటి ఓవర్‌లో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రిజ్వాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

కానీ ఆ వెంటనే జమాన్ 6, 4తో జోరు కనబర్చాడు. అయితే కమిన్స్ వేసిన 19వ ఓవర్‌లో ఫస్ట్ బాల్‌కే డేంజరెస్ అసిఫ్ అలీ ఔటవ్వగా.. ఆ మరుసటి బంతికి ఫకార్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్మిత్ నేలపాలు చేశాడు. ఈ ఓవర్‌లో కమిన్స్ కేవలం మూడు పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్‌లో స్టార్క్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాలిక్‌ను ఔట్ చేశాడు. అయితే ఫకార్ జమాన్ రెండు భారీ సిక్స్‌లు కొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

Story first published: Thursday, November 11, 2021, 21:51 [IST]
Other articles published on Nov 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+