Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AUS: డేవిడ్ వార్నర్‌కు ఘన వీడ్కోలు ఎందుకు? మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు!

PAK vs AUS: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఘన వీడ్కోలు ఎందుకు? అంటూ ఆ జట్టు మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ప్రశ్నించాడు. అతనేం హీరో కాదని అభిప్రాయపడ్డాడు. ఘన వీడ్కోలు పొందేందుకు అతను అర్హుడు కాదన్నాడు.

సొంతగడ్డపై పాకిస్థాన్‌‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డేవిడ్ వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. పెర్త్ వేదికగా తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కింది.

PAK vs AUS: Mitchell Johnson says David Warner Doesnt Warrant Heros Send-Off

ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్‌కు ప్రయత్నించి ఆస్ట్రేలియా పరువు తీసిన డేవిడ్ వార్నర్‌కు ఘన వీడ్కోలు ఎందుకని ప్రశ్నించాడు.

'డేవిడ్ వార్నర్‌కు వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా దారుణంగా విఫలమవుతున్న అతనికి రిటైర్మెంట్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఎందుకు ఇచ్చారు? ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంలో నిలిచిన ఒక ఆటగాడిని హీరోగా వీడ్కోలు పలకడానికి ఎందుకు సిద్దమవుతున్నారు.'అని విచెల్ జాన్సన్ ప్రశ్నల వర్షం కురిపించాడు.

PAK vs AUS: Mitchell Johnson says David Warner Doesnt Warrant Heros Send-Off

తొలి టెస్ట్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు:

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

Story first published: Sunday, December 3, 2023, 16:04 [IST]
Other articles published on Dec 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+