Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AUS: పాక్ కొంపముంచిన హసన్ అలీ.. ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ!

Marcus Stoinis, Matthew Wade heroics help

దుబాయ్: ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హసన్ అలీ చేసిన ఘోర తప్పిదం పాకిస్థాన్ కొంపముంచింది. 19వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చగా.. ఆ అవకాశాన్ని అందుకున్న వేడ్ రెండు భారీ సిక్స్‌లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

చెలరేగిన రిజ్వాన్, ఫకార్..

చెలరేగిన రిజ్వాన్, ఫకార్..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.

ఆదిలోనే ఆసీస్‌కు షాక్..

ఆదిలోనే ఆసీస్‌కు షాక్..

177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. షాహిన్ అఫ్రిదీ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే కెప్టెన్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్‌తో డేవిడ్ వార్నర్ ఎదురు దాడికి దిగాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. దాంతో ఆసీస్ పవర్ ప్లేలో నే వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. అయితే ఆ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్‌ను రంగంలోకి దింపగా.. భారీ షాట్‌కు యత్నించిన మిచెల్ మార్ష్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఫస్ట్ వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అంపైర్ తప్పుడు నిర్ణయం..

అంపైర్ తప్పుడు నిర్ణయం..

అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(5) సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఆ వెంటనే డేవిడ్ వార్నర్‌ను కూడా షాదాబ్ పెవిలియన్ చేర్చి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బతీశాడు. అయితే వార్నర్ ఔట్‌పై దుమారం రేగింది. బంతి అతని బ్యాట్ తాకలేదని స్నీకో మీటర్‌లో స్పష్టంగా కనిపించింది. ఆ కొద్దిసేపటికే గ్లేన్ మ్యాక్స్‌వెల్ కూడా షాదాబ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్‌పై పాక్ పట్టు బిగించినట్లు కనిపించింది. కానీ ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ అద్భుతంగా ఆడారు. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను చివరి వరకు తీసికెళ్లారు.

హసన్ అలీ తప్పిదంతో..

హసన్ అలీ తప్పిదంతో..

క్రీజులో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్న ఈ జోడీ చివర్లో ధాటిగా ఆడింది. ముఖ్యంగా హసన్ అలీ వేసిన 18వ ఓవర్‌లో 6, 4‌తో 15 పరుగులు పిండుకోవడంతో ఆసీస్ శిభిరంలో ఆశలు కలిగాయి. చివరి 2 ఓవర్లలో ఆసీస్ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. బాబర్ తన ట్రంప్ కార్ట్ షాహిన్ షా అఫ్రీదిని రంగంలోకి దింపాడు. తొలి రెండు బంతుల్లో ఒకే సింగిల్ రాగా.. మూడో బంతిని షాహిన్ వైడ్ వేసాడు. ఆ మరుసటి బంతిని వేడ్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. హసన్ అలీ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన వేడ్ చివరి మూడు బంతులను హ్యాట్రిక్ సిక్స్‌లుగా మలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Friday, November 12, 2021, 7:21 [IST]
Other articles published on Nov 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+