Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AUS: ఒక్క బంతికి 9 రన్స్.. డేవిడ్ వార్నరా? మజాకా?

Pak vs Aus: David Warner Scores 9 Runs In 1 Ball vs Hafeez

దుబాయ్: అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాకిస్థాన్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) వీరోచిత బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆదివారం న్యూజిలాండ్‌‌తో జరిగే టైటిల్ ఫైట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వన్డే ప్రపంచకప్‌ల్లో తిరుగులేని రికార్డు ఉన్న ఆసీస్‌కు ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టైటిల్ దక్కలేదు. ఈ సారైన ఆ కలను నేరవేర్చుకోవాలనుకుంటుంది.

పాకిస్థాన్‌తో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ కొట్టిన సిక్స్ నవ్వులు పూయించింది. వార్నర్ స్మార్ట్ బ్యాటింగ్‌కు పాకిస్థాన్ ఒక్క బంతికే 9 పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ హఫీజ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతి అతని చేతి నుంచి జారి డబుల్ బౌన్సర్‌గా బ్యాట్స్‌మన్‌కు దూరంగా వెళ్లింది. అయితే వార్నర్ స్మార్ట్‌గా ఈ బంతిని వెంటాడి మరి సిక్స్‌గా తరలించాడు. అయితే ఈ డెలీవరీని అంపైర్ నోబాల్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్‌కు గురైన హఫీజ్ నోబాల్ ఎందుకని నిలదీశాడు. కానీ డబుల్ బౌన్సర్ అయినందుకని చెప్పడంతో ఏం మాట్లాడలేకపోయాడు. దాంతో ఆసీస్‌కు ఫ్రీ హిట్ లభించగా.. మరుసటి బంతిని హాఫిజ్ కట్టుదిట్టంగా వేయడంతో రెండు రన్స్ వచ్చాయి. దాంతో పాక్ ఒకే బంతికి 9 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్‌లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.

Story first published: Friday, November 12, 2021, 0:17 [IST]
Other articles published on Nov 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+