
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ బలయ్యాడు. అద్భుత బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను చితక్కొట్టిన వార్నర్.. హాఫ్ సెంచరీ ముంగిట కీపర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే బంతి అతని బ్యాట్‌కు తగలలేదని స్నీకో మీటర్‌లో తేలింది. దాంతో అభిమానులు అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ కూడా రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
షాదాబ్ ఖాన్ వేసిన 11 ఓవర్ తొలి బంతిని వార్నర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన వార్నర్.. బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. ఇక బంతిని అందుకున్న కీపర్ రిజ్వాన్ గట్టిగా అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. కానీ టీవీ రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకినట్లు కనిపించలేదు. స్నీకో మీటర్‌లో కూడా ఎలాంటి స్పైక్స్ కనిపించలేదు. దాంతో వార్నర్ ఔటవ్వకుండానే పెవిలియన్ చేరాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వార్నర్ వికెట్‌తో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. వార్నర్ వికెట్ అనంతరం మ్యాక్స్‌వెల్ కూడా ఔటవ్వడంతో 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు అద్భుత విజయాన్నందించారు. దాంతో అంపైర్ తప్పిదం చేసినా.. ఆ దేవుడు న్యాయమే చేశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.