PAK vs AUS: విరాట్ కోహ్లీకి దక్కని రికార్డు.. బాబర్ ఆజామ్ సొంతం!

కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల దూరంలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న బాబర్ ఆజామ్.. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన తొలి పాక్ బ్యాట్స్‌న్‌గా గుర్తింపు పొందాడు. మొత్తం 425 బంతులను ఎదుర్కొన్న బాబర్ ఆజామ్ 21 ఫోర్లు, సిక్సర్‌తో 196 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ ముంగిట నాథన్ లయన్ బౌలింగ్ లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డబుల్ సెంచరీ చేజార్చుకున్నా.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బాల్స్ ఆడిన మూడో క్రికెటర్‌గా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఈ జనరేషన్‌లో ఒకే ఒక్కడు..
ఈ జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన మైక్ అథర్టన్ అగ్రస్థానంలో ఉండగా.. హెర్బ్ సట్సిఫ్, సునీల్ గవాస్కర్ బాబర్ ఆజామ్ కన్నా ముందున్నారు. 1995లో మైక్ అథర్టన్ నాలుగో ఇన్నింగ్స్ 492 బంతులాడి ఈ రికార్డు నమోదు చేశాడు. 1928లో హెర్బ్ 462 బాల్స్ ఆడగా.. 1979లో భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ 443 బాల్స్ ఆడాడు. తాజాగా ఈ జాబితాలో బాబర్ ఆజామ్ చేరాడు. వరల్డ్ బెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఈ జనరేషన్ ఆటగాళ్లలో ఒక్కరికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ప్రస్తుత తరం ఆటగాళ్ల నుంచి బాబర్ ఆజామ్ ఒక్కడే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

డ్రాగా ముగిసిన మ్యాచ్..
ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిన పాకిస్థాన్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ చివరకు ఫలితం తేలకుండానే ముగిసింది. ఎన్నో మలుపులు తిరుగుతూ ఇరు జట్లను ఊరించిన ఫలితం చివరకు తేలనేలేదు. మొత్తానికి సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ తృటిలో ఓటమిని తప్పించుకుంది. 506 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. చివరి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 443 పరుగులు చేసి డ్రాతో గట్టెక్కింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(196) భారీ ఇన్నింగ్స్‌కు తోడు.. మహమ్మద్ రిజ్వాన్(104 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో ఓటమిని తప్పించుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(96) సైతం అద్భుతంగా ఆడాడు. బాబర్‌తో కలిసి మూడో వికెట్‌కు 228 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.


భారీ స్కోర్లు నమోదు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 556/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఉస్మాన్ ఖవాజా(160) భారీ సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(72), అలెక్స్ క్యారీ(93) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 148 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 97/2 స్కోర్‌కు డిక్లేర్ ఇచ్చి 506 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications