Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కళ్లు చెదిరే క్యాచ్.. పట్టింది పాకిస్థాన్ ఆటగాడే! (వీడియో)

హంబన్‌టోట: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కళ్లు చెదిరే ‌క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డే‌లో షాదాబ్ ఖాన్ మైమరిపించే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని అసాధారణ క్యాచ్‌కు అఫ్గాన్ బ్యాటర్ హస్మతుల్లా షాహిది బిత్తరపోయాడు.

నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని నసీమ్ షా షార్ట్ పిచ్ బాల్‌గా వేయగా.. హస్మతుల్లా పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ ఖాన్.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఎడమ చేత్తో అందుకున్నాడు. చేతుల్లో నుంచి బంతి జారుతుండగా.. సూపర్ డైవ్‌తో క్యాచ్‌ను పూర్తి చేశాడు.

Shadab Khan Grab A Leaping Stunner to Dismiss Hashmatullah

జిమ్నాస్టిక్ స్టంట్‌ను తలపించిన ఈ క్యాచ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షాదాబ్ ఖాన్‌‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత గొప్ప క్యాచ్ పట్టింది పాకిస్థాన్ ఆటగాడేనా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్ పరమ చెత్తగా ఉంటుంది. సునాయస క్యాచ్‌లు నేలపాలు చేయడం తరుచూ చూస్తుంటాం. కానీ ఈ మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ అసాధారణ క్యాచ్‌తో అందర్నీ సంభ్రమాశ్చర్యానికి గురి చేశాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్(5/18) ఐదు వికెట్లతో రఫ్ఫాడించడంతో అఫ్గానిస్థాన్ 59 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 47.1 ఓవర్లలో 201 పరుగులకు కుప్పకూలింది. ఇమామ్ ఉల్ హక్(94 బంతుల్లో 2 ఫోర్లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇఫ్తికార్ అహ్మద్(30), షాదాబ్ ఖాన్(39) విలువైన పరుగులు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(0) డకౌటవ్వగా.. ఓపెనర్ ఫకార్ జమాన్(0), అఘా సల్మాన్(7), మహమ్మద్ రిజ్వాన్(21) దారుణంగా విఫలమయ్యారు.

అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రెహ్మాన్ 3 వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫజలక్ ఫరూఖీ, రెహ్మత్ షా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 19.2 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్‌కు తోడుగా షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, August 22, 2023, 22:05 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+