For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs AFG: చెలరేగిన చిచ్చా.. పాకిస్థాన్ స్కోర్ ఎంతంటే..?

పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. అఫ్గాన్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని 283 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(92 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74), అబ్దుల్లా షఫీక్(75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది.

షాదాబ్ ఖాన్(40), ఇఫ్తికర్ అహ్మద్(40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/49) మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీ, అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది.

PAK vs AFG: Pakistan post 282/7 After Iftikhar, Shabad cameos in CWC 2023

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్(17) శుభారంభాన్ని అందించారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆచితూచి ఆడిన ఈ జోడీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. అయితే అజ్మతుల్లా ఓమర్జాయ్ వేసిన 11వ ఓవర్ తొలి బంతికే ఇమామ్ ఉల్ హక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజామ్‌తో కలిసి అబ్దుల్లా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అబ్దుల్లాను నూర్ అహ్మద్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్(8)ను కూడా నూర్ అహ్మద్ తన మరుసటి ఓవర్‌లో క్యాచ్ ఔట్ చేశాడు.

PAK vs AFG: Pakistan post 282/7 After Iftikhar, Shabad cameos in CWC 2023

దాంతో బ్యాటింగ్‌కు దిగిన సౌద్ షకీల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని మహమ్మద్ నబీ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి షాదాబ్ ఖాన్ రాగా.. బాబర్ ఆజామ్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన బాబర్ ఆజామ్‌ను నూర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ 206 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లపై అటాక్ చేసిన ఇఫ్తికర్ అహ్మద్ వేగంగా పరుగులు రాబట్టాడు. భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్స్ ఆడే క్రమంలో ఇఫ్తికర్, షాదాబ్ ఔటవ్వడంతో పాకిస్థాన్ 300 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది.

Story first published: Monday, October 23, 2023, 17:52 [IST]
Other articles published on Oct 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+