Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AFG: రఫ్ఫాడించిన హరీస్ రౌఫ్.. పాక్ చేతిలో అఫ్గాన్ చిత్తు!

హంబన్‌టోట: అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ విజయంతో ప్రారంభించింది. ఆసియాకప్ 2023కి సన్నాహకంగా శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్(5/18) ఐదు వికెట్లతో రఫ్ఫాడించడంతో అఫ్గానిస్థాన్ 59 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 47.1 ఓవర్లలో 201 పరుగులకు కుప్పకూలింది. ఇమామ్ ఉల్ హక్(94 బంతుల్లో 2 ఫోర్లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇఫ్తికార్ అహ్మద్(30), షాదాబ్ ఖాన్(39) విలువైన పరుగులు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(0) డకౌటవ్వగా.. ఓపెనర్ ఫకార్ జమాన్(0), అఘా సల్మాన్(7), మహమ్మద్ రిజ్వాన్(21) దారుణంగా విఫలమయ్యారు.

PAK team

అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రెహ్మాన్ 3 వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫజలక్ ఫరూఖీ, రెహ్మత్ షా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 19.2 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్‌కు తోడుగా షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అఫ్గాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది వరుస బంతుల్లో ఇబ్రహిమ్ జడ్రాన్(0), రెహ్మాత్ షా(0)లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే షాదాబ్ ఖాన్ సంచలన క్యాచ్‌కు హష్మతుల్లా షాహిది(0) వెనుదిరిగాడు. రంగంలోకి దిగిన హ్యారీస్ రౌఫ్ వరుస ఓవర్లలో అఫ్గాన్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చి పాక్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Haris Rauf

అఫ్గాన్ బ్యాటర్లలో రెహ్మనుల్లా గుర్బాజ్(18), అజ్మతుల్లా ఒమార్జి(16) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఐదు వికెట్లు తీసిన హ్యారీస్ రౌఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.

Story first published: Tuesday, August 22, 2023, 21:45 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+