Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AFG: చెత్త నా కొడుకా.. కొద్దిలో క్యాచ్ మిస్సయ్యేది! (వీడియో)

హంబాంటోటా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ఓవర్‌లోనే పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ ఫకార్ జమాన్(2) స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫజలక్ ఫరూఖీ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను ఫకార్ జమాన్ ఆఫ్ సైడ్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది.

Mohammad Nabi takes brilliant Catch.

కానీ సెకండ్ స్లిప్ ఫీల్డర్ అల్టర్‌గా లేకపోవడంతో అతని చేతులను తాకిన బంతి గాల్లోకి లేవగా ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ మహమ్మద్ నబీ అందుకున్నాడు. వెంటనే క్యాచ్ చేజార్చిన ఫీల్డర్‌పై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'చెత్త నా కొడుకా కొద్దిలో క్యాచ్ మిస్సేయ్యేది'అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ మరుసటి ఓవర్‌లో‌నే క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్(0) బ్రాంజ్ డక్‌గా వెనుదిరిగాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన రెండో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 7 పరుగులకే పాకిస్థాన్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

క్రీజులోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఇమామ్ ఉల్ హక్ నిలకడగా ఆడుతున్నాడు. 5 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఆసియాకప్ 2023 టోర్నీకి ముందు సన్నాహకంగా పాకిస్థాన్ ఈ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఆగస్టు 30 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది.

శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఎంచుకుంది. ఆసియాకప్ 2023 టోర్నీని పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు లీగ్ మ్యాచ్‌లు పాక్ వేదికగా జరగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి.

Story first published: Tuesday, August 22, 2023, 15:52 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+