For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గాన్ ఆల్‌రౌండర్‌‌పై నోరుపారేసుకున్న బాబర్ ఆజామ్! (వీడియో)

హంబంటోట: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సహనం కోల్పోయాడు. అఫ్గానిస్థాన్‌తో శుక్రవారం ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠగా సాగగా.. ఆఖరి ఓవర్‌లో హై డ్రామా చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను మన్కడింగ్ తరహాలో రనౌట్ చేయడం చర్చనీయాంశమైంది.

మ్యాచ్ అనంతరం ఇది అనైతికమంటూ బాబర్ ఆజామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి ఆటగాడిపై నోరుపారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

PAK vs AFG: Babar Azam loses cool, engages in heated argument with Nabi goes Viral

అసలేం జరిగిందంటే.?
301 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్‌ విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమయ్యాయి. కొత్త బ్యాటర్ నసీమ్ షా బ్యాటింగ్ చేస్తుండగా.. నాన్‌స్ట్రైకర్‌గా షాదాబ్ ఖాన్ ఉన్నాడు. అప్పటికే అతను 35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలిచాడు.

స్ట్రైకింగ్ తీసుకొని మ్యాచ్ ముగించాలనే ఉత్సాహంతో ఆఖరి ఓవర్ తొలి బంతి వేయకముందే క్రీజును ధాటిన షాదాబ్ ఖాన్‌ను ఫజలక్ ఫరూఖీ రనౌట్ చేశాడు. బంతి వేయకముందే షాదాబ్ ఖాన్ క్రీజు ధాటడాన్ని గుర్తించిన అంపైర్లు నిబంధనల ప్రకారం రనౌట్‌గా ప్రకటించారు. దాంతో షాదాబ్ ఖాన్ నిరాశగా పెవిలియన్ చేరగా.. మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

అఫ్గాన్ విజయానికి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని అంతా భావించారు. పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం ఇది అనైతికమని, క్రీడా స్పూర్తికి విరుద్దమనేలా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. చివరి ఓవర్‌లో నసీమ్ షా రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేయడంతో పాక్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో బాబర్ ఆజామ్.. అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీపై నోరుపారేసుకున్నాడు. ఇంత అనైతికంగా ఎలా రనౌట్ చేస్తారని, విజయం కోసం ఇంతలా దిగజారాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజామ్ మాటలను నబీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోగా.. బాబర్ మాత్రం నోరుపారేసుకున్నాడు.

నిబంధనల ప్రకారం బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజును ధాటినప్పుడు వికెట్లను కొడితే రనౌట్‌గా ప్రకటిస్తారు. గతంలో దీన్ని మన్కడింగ్ పిలిచేవారు. అనైతికంగా భావించేవారు. కానీ ఈ నిబంధనపై పలు మార్లు దుమారం రేగడంతో క్రికెట్ నిబంధనలను రూపొందించే ఎంసీసీ.. పలు మార్పులు చేసింది.

ఈ తరహా ఔట్‌ను మన్కడింగ్ అని పిలవద్దని, ఇది ఏ మాత్రం అనైతికం కాదని, ఇది కూడా రనౌట్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయినా ఈ తరహా వికెట్‌పై దుమారం రేగుతూనే ఉంది.

Story first published: Friday, August 25, 2023, 20:08 [IST]
Other articles published on Aug 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+