For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs AFG: అఫ్గాన్ సంచలన విజయం వెనుక టీమిండియా దిగ్గజ క్రికెటర్!

PAK vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ మరో సంచలన విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో ఉన్న అఫ్గాన్ 6వ ప్లేస్‌కు దూసుకొచ్చింది.

ఈ మెగా టోర్నీలో అఫ్గాన్‌కు ఇది రెండో విజయం. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో మూడే మూడు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గానిస్థాన్.. ఈ టోర్నీలో రెండు విజయాలు అందుకోవడం విశేషం. 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్‌లాండ్‌పై తొలి విజయాన్ని అందుకున్న అఫ్గాన్.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఖాతా తెరవలేకపోయింది.

PAK vs AFG: Ajay Jadeja remains unbeatable against Pakistan in World Cups

అయితే ఈ సారి అఫ్గాన్ రెండు విజయాలు అందుకోవడం వెనుక టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజయ్ జడేజా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ ముందే అజయ్ జడేజాను అఫ్గాన్ మెంటార్‌గా నియమించుకుంది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అజయ్ జడేజా సాయంతో ప్రణాళికలను సిద్దం చేసుకొని అఫ్గాన్ బరిలోకి దిగుతోంది.

టీమిండియా తరఫున సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన అజయ్ జడేజా అనుభవం అఫ్గాన్‌కు కలిసొచ్చింది. అతని మార్గదర్శకంలో అఫ్గాన్ రెండు సంచలన విజయాలు నమోదు చేసింది. దాంతో జడేజాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. జడేజా, జోనాథన్ అఫ్గాన్ టీమ్‌ను సరికొత్త దిశలో తీసుకెళ్తున్నారు.

PAK vs AFG: Ajay Jadeja remains unbeatable against Pakistan in World Cups

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(92 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74), అబ్దుల్లా షఫీక్(75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/49) మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీ, అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో2 వికెట్లకు 286 పరుగులు చేసి గెలుపొందింది. ఇబ్రహీమ్ జడ్రాన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 87), రెహ్మానుల్లా గుర్బాజ్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 65), రెహ్మత్ షా(84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

హష్మతుల్లా(45 బంతుల్లో 4 ఫోర్లతో 48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీకి తలో వికెట్ దక్కింది.

Story first published: Monday, October 23, 2023, 23:05 [IST]
Other articles published on Oct 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+