Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs AFG: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌‌పై సంచలన విజయం!

PAK vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో మరో సంచలన ఫలితం నమోదైంది. పసికూన అఫ్గానిస్థాన్ మరో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్.. అదే జోరులో పటిష్ట పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అఫ్గాన్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానం నుంచి 6వ ప్లేస్‌కు దూసుకెళ్లింది.

PAK vs AFG: Afghanistan register Historic win over Pakistan in World Cup 2023

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(92 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74), అబ్దుల్లా షఫీక్(75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/49) మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీ, అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో2 వికెట్లకు 286 పరుగులు చేసి గెలుపొందింది. ఇబ్రహీమ్ జడ్రాన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 87), రెహ్మానుల్లా గుర్బాజ్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 65), రెహ్మత్ షా(84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

హష్మతుల్లా(45 బంతుల్లో 4 ఫోర్లతో 48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీకి తలో వికెట్ దక్కింది.

Rahmanullah Gurbaz being congratulated by teammate Ibrahim Zadran

అదిరిపోయే ఆరంభం: 283 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభం నుంచే పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దాంతో అఫ్గానిస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కొనసాగించిన ఈ జోడీ.. వేగంగా పరుగులు రాబట్టింది.

ఈ క్రమంలో ముందుగా ఇబ్రహీమ్ జడ్రాన్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్ది సేపటికే రెహ్మనుల్లా గుర్బాజ్ 38 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. దాంతో అఫ్గానిస్థాన్ 16 ఓవర్లలోనే 105 పరుగులు చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని షాహిన్ అఫ్రిది విడదీసాడు. రెహ్మనుల్లా గుర్బాజ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Rahmat Shah plays a shot during the ICC Mens Cricket World Cup

చెలరేగిన రెహ్మత్ షా: క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షాతో కలిసి జడ్రాన్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. పాకిస్థాన్ స్పిన్నర్లను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇబ్రహీం జడ్రాన్‌ను హసన్ అలీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హష్ముతుల్లా షాహిది, రెహ్మత్ షా ఆచితూచి ఆడారు. రిస్కీ షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. 58 బంతుల్లో రెహ్మత్ షా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. హష్మతుల్లా షాహిది అతనికి సహకరించాడు. వేగంగా పరుగులు చేసిన రెహ్మత్ షా.. అఫ్గాన్ విజయాన్ని సులువు చేయగా.. హష్మతుల్లా షాహిది బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Monday, October 23, 2023, 22:10 [IST]
Other articles published on Oct 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+