For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ బ్యాటర్ విధ్వంసం.. 8 బంతుల్లో 8 సిక్స్‌లు.!(వీడియో)

క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఓ పాకిస్థాన్ బ్యాటర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టడమే గొప్ప అనుకుంటే సదరు పాక్ బ్యాటర్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాది సంచలనం సృష్టించాడు. వరుసగా తాను ఎదుర్కొన్న 8 బంతులను సిక్సర్లుగా తరలించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ అరుదైన ఘటన స్పెయిన్ టీ10 టోర్నీలో చోటు చేసుకుంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ వరుసగా 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాదాడు. ఏడో ఓవర్ చివరి 5 బంతులను ఐదు సిక్స్‌లు‌గా మలిచిన అలీ హసన్.. 8వ ఓవర్‌ రెండో బంతి నుంచి వరుసగా 3 సిక్సర్లు కొట్టాడు.

PAK Barcelona Batter Smashes 8 Sixes Off 8 Balls Video Goes Viral

మొత్తంగా 16 బంతుల్లో 8 సిక్సర్లు, ఒక బౌండరీ సాయంతో 55 పరుగులు చేశాడు. దాంతో పాక్ బార్సిలోనా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యునైటెడ్ సీసీ టీమ్ 9.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లే రికార్డ్‌గా కొనసాగుతోంది. యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్, గిబ్స్ వంటి బ్యాటర్లు 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదారు. దేశవాళీ క్రికెట్‌లో రవి శాస్త్రితో పాటు మరికొందరు ఈ ఫీట్ సాధించారు. అయితే 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాదడం మాత్రం ఇదే తొలిసారి.0

Story first published: Thursday, November 21, 2024, 11:07 [IST]
Other articles published on Nov 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+