For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ గెలిచే సీన్ మనకి లేదు.. భారత డ్రెస్సింగ్ రూమ్‌లోని పరిస్థితి: ప్యాడీ ఆప్టన్

Paddy Upton reveals one incident when team management thought the Indian team isnt ready to win the 2011 World Cup

న్యూఢిల్లీ: టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన ప్యాడీ అప్టన్ 2011 ప్రపంచకప్ విజయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ ప్రపంచకప్ విజయానికి ముందు భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. 2008 నుంచి 2011 వరకూ భారత జట్టుకి మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టన్... మళ్లీ ఇన్నాళ్లకు టీ20 ప్రపంచకప్ కోసం తాత్కలిక బాధ్యతలు అందుకున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆటగాళ్ల‌లో మెగా టోర్నీ ఒత్తిడిని తొలగించేందుకు తాము అనుసరించిన విధానాన్ని అప్టన్ తెలియజేశాడు.

భారత్‌కు గెలిచే సీన్ లేదని..

భారత్‌కు గెలిచే సీన్ లేదని..

'అది ఆసియా కప్ ఫైనల్ జరగాల్సిన రోజు. అప్పటికి 2011 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 10 నెలల సమయం ఉంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో శ్రీలంకలోనే మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ రోజు ఉదయం డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మమ్మల్ని 'ఒకవేళ ఇదే వరల్డ్ కప్ ఫైనల్ అనుకుంటే.. ఇలాగే వెళ్లి గెలవగలమా?'అని ప్రశ్నించాడు.అప్పుడు నాతో పాటు బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమ్మన్స్ ఉన్నారు. మేం వేంటనే 'లేదు.. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచేందుకు మనం సిద్దంగా లేం.'అని చెప్పాం. ఎందుకంటే సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య ఇలాంటి పెద్ద టోర్నీలు ఆడటాన్ని ఆటగాళ్లు చాలా ఒత్తిడికి భావించేవారు.

ఫైనల్ ఒత్తిడిని అధిగమించేందుకు..

ఫైనల్ ఒత్తిడిని అధిగమించేందుకు..

పైగా 2011 ప్రపంచప్ ఫైనల్ వాంఖడే వేదికగా జరగనుందనే విషయం తెలుసు. మ్యాచ్ చూడటానికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్, సైలెంట్‌గా మ్యాచ్‌ని ఎంజాయ్ చేయరు. ఏ మాత్రం తేడా జరిగినా అరిచి గగ్గోలు పెడుతూ ప్లేయర్లను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తారు.. అదీకాకుండా సచిన్ టెండూల్కర్‌కి అది ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్. మేం అనుకున్నట్లుగానే ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన ప్రతీ ప్లేయర్ తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు. అయితే మేం ఈ ఒత్తిడిని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవడంతో ఆటగాళ్లు రాణించగలిగారు.

 మానసికంగా సిద్దం చేశాం..

మానసికంగా సిద్దం చేశాం..

అలాంటి హై ప్రెజర్ మ్యాచుల కోసం ప్లేయర్లు ముందుగానే మానసికంగా సిద్ధం కావాలి. ఆసియా కప్ ఫైనల్ రోజు నుంచి ప్రతీ మీటింగ్‌లోనూ ఇదే మాటతో డిస్కషన్ మొదలెట్టాం... 'ముంబైలో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఏప్రిల్ 2న జరిగే ఫైనల్లో మనం ఆడుతున్నాం' అంటూ మీటింగ్ మొదలయ్యేది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కి వచ్చేసరికి ప్లేయర్లు ఆ పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఆటగాళ్లను ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 10 నెలల నుంచే మెంటల్‌గా ప్రిపేర్ చేయడం మొదలెట్టాం. ఫైనల్‌కి వచ్చినప్పుడే మేమే గెలవబోతున్నామనే నమ్మకం ప్లేయర్లలో నిండిపోయింది.' ప్యాడీ అప్టన్ చెప్పుకొచ్చాడు.

 ప్రపంచకప్ గెలవడమే..

ప్రపంచకప్ గెలవడమే..

2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ 28 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. గౌతమ్ గంభీర్ 97 పరుగులతో, మహేంద్ర సింగ్ ధోనీ( 91 నాటౌట్) అజేయ హాఫ్ సెంచీరతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన భారీ సిక్సర్.. ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్యాడీ ఆప్టన్‌ను మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా జట్టులోకి తీసుకొచ్చింది.

Story first published: Friday, July 29, 2022, 15:11 [IST]
Other articles published on Jul 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+