టీమిండియాలోకి కీలక కోచ్.. టీ20 ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా..

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ టీమిండియా గెలవడమే లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. విజయం కోసం జట్టుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూనే సీనియర్ ఆటగాళ్లకు సైతం విశ్రాంతిని కల్పిస్తోంది. ఇప్పుడు మరో ముందడుగు వేసిన బీసీసీఐ.. ప్రఖ్యాత మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ మళ్లీ జట్టులోకి తీసుకుంది. దాంతో ఆయన తిరిగి భారత జట్టుతో పని చేయనున్నాడు.

2011 ప్రపంచకప్ గెలిచిన..
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సహాయ సిబ్బందిలో ప్యాడీ అప్టన్ కీలక సభ్యుడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో స్వల్పకాలిక కాంట్రాక్ట్‌తో టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 'ప్యాడీ ఆప్టన్ బుధవారం వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడనున్న భారత జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ముగిసేవరకు కొనసాగుతాడు. ఇది తాత్కాలిక ఏర్పాటు'అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపాడు. అప్టన్ వివిధ ఐపీఎల్ జట్లకు కూడా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేశాడు.

ముందు జాగ్రత్తగానే..
2011 ప్రపంచకప్ గెలవడంలో ప్యాడీ అప్టన్‌ది కీలక పాత్ర. తీవ్ర ఒత్తిడి ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచడంలో అతను ఎక్స్‌పర్ట్. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన భారత్‌కు మళ్లీ అలాంటి పరిస్థితి రావద్దని టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే టీమ్ ఎంపికను సీరియస్‌గా తీసుకుంది. గతేడాది లీగ్ దశలోనే వెనుదిరిగా భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఫైనల్ చేరడం ఖాయమని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లను మానసికంగా ప్రశాంతంగా ఉంచేందుకు ప్యాడీ అప్టన్‌ను జట్టులోకి తీసుకొచ్చారు.

సెక్స్ చేయాలంటూ...
2011 ప్రపంచకప్‌కు సంబంధించిన విషయాలను ప్యాడీ అప్టన్ తన బుక్ 'ద బేర్‌ఫుట్ కోచ్'లో రాసుకున్నాడు. అందులో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆ 2011 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు ముందు ఇండియన్ టీమ్ ప్లేయర్స్‌ను శృంగారం చేయాల్సిందిగా తాను సూచించినట్లు ఆ బుక్‌లో అప్టాన్ చెప్పాడు. అయితే తాను ఇచ్చిన ఈ సలహా హెడ్ కోచ్ కిర్‌స్టెన్‌కు ఆగ్రహం తెప్పించినట్లు కూడా ఆయన తన బుక్‌లో రాశాడు. దీంతో తాను కిర్‌స్టెన్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని అప్టాన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications