Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీకి అది నేర్పండి.. లేకుంటే మరో పృథ్వీ షా అవుతాడు: ప్యాడీ ఆప్టన్

టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వైఫల్యాలు తట్టుకునేలా సిద్దం చేయాలని బీసీసీఐకి టీమిండియా మాజీ మెంటల్ స్ట్రెంగ్త్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సూచించాడు. చిన్న వయసులోనే వచ్చిన ఫేమ్‌ను సమన్వయం చేసుకోవడం వైభవ్ సూర్యవంశీకి అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డాడు.

టీమిండియా భవిష్యత్తు తారగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీకి బ్యాటింగ్ టెక్నిక్స్ మాత్రమే కాకుండా మానసిక దృఢత్వాన్ని అలవర్చడం, కెరీర్‌లో వచ్చే ఎత్తుపల్లాలను సమానంగా స్వీకరించేలా సిద్ధం చేయడం ముఖ్యమని సూచించాడు. లేకుంటే మరో పృథ్వీ షాలా దేశవాళీ స్టార్‌గా మిగిలిపోతాడని హెచ్చరించాడు.

వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మను శిక్షించిన బీసీసీఐ

వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మను శిక్షించిన బీసీసీఐ

14 ఏళ్ల వయసులోనే..

14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి పరుగుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌తో పాటు టీమిండియా పిలుపును అందుకున్నాడు. అయితే భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వచ్చిన వైభవ్ సూర్యవంశీ వరుస మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అంతేకాకుండా శ్రీలంక ఆటగాళ్లతో గొడవకు దిగాడు.

Paddy Upton Issues Vital Psychological Warning Over Prodigy Vaibhav Sooryavanshi says Prepare Him for Failure

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడిన ప్యాడీ ఆప్టన్.. చిన్న వయసులోనే అతను ఆడుతున్న తీరు అద్భుతమని కొనియాడాడు. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆడే సామర్థ్యం అతనికి ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే చిన్న వయసులోనే వచ్చిన ఫేమ్‌తో అతనిపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయన్నాడు. అది అతనిపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని చెప్పాడు.

కోహ్లీ, సచిన్‌కే తప్పలేదు..

'మెంటల్ స్ట్రెంగ్త్ కోచ్‌గా నేనే చేసే మొదటి పని వైభవ్ సూర్యవంశీని మానసికంగా వైఫల్యాలకు సిద్దం చేయడం. రాబోయే రెండు, మూడు మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ అయితే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతను దానిని ఎలా ఎదుర్కొంటాడు? ఆటలో వైఫల్యాలు సహజం. ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఫామ్ కోల్పోవడం, వరుసగా విఫలమవడం అనేది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకే అది తప్పలేదు.

గత 5-6 ఏళ్లలో ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి తర్వాతి సచిన్, కోహ్లీ, ధోనీ అని ప్రశంసలు అందుకున్న యువ ఆటగాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. వాళ్లు సాధారణ దేశీయ ఆటగాళ్లుగా మారిపోయారు. దానికి కారణం తమపై పెరిగిన అంచనాలను ఆకస్మిక కీర్తిని వారు తట్టుకోలేకపోవడమే. ఇప్పుడు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వైభవ్‌కు ఎవరు సాయం చేస్తున్నారో నాకు తెలియదు. చిన్న వయసులోనే వచ్చిన ఫేమ్‌ను తట్టుకోవడం ఒక ఆటగాడికి అత్యంత సవాల్‌తో కూడుకున్న విషయం.'అని ప్యాడీ ఆప్టన్ అభిప్రాయపడ్డాడు.

సచిన్ దరిదాపుల్లోకి కూడా రాలేడు: మాజీ కెప్టెన్ ఫైర్!

సచిన్ దరిదాపుల్లోకి కూడా రాలేడు: మాజీ కెప్టెన్ ఫైర్!
Story first published: Thursday, June 18, 2026, 18:09 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+