
మ్యాచ్‌కు ముందు శృంగారం చేయండి
2011 ప్రపంచకప్ సమయంలో భారత జట్టు కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ ఉన్నాడు. అయితే అప్పట్లో కిర్‌స్టెన్ ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్న మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టాన్.. తాజాగా తన బుక్ 'ద బేర్‌ఫుట్ కోచ్'లో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆ 2011 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు ముందు ఇండియన్ టీమ్ ప్లేయర్స్‌ను శృంగారం చేయాల్సిందిగా తాను సూచించినట్లు ఆ బుక్‌లో అప్టాన్ చెప్పాడు. అయితే తాను ఇచ్చిన ఈ సలహా హెడ్ కోచ్ కిర్‌స్టెన్‌కు ఆగ్రహం తెప్పించినట్లు కూడా ఆయన తన బుక్‌లో రాశాడు. దీంతో తాను కిర్‌స్టెన్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని అప్టాన్ తెలిపాడు.

మెరుగైన ప్రదర్శన చేయగలరు
అంతకుముందు 2009 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కూడా తాను ప్లేయర్స్ కోసం నోట్స్ సిద్ధం చేశానని, అందులో శృంగారం వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా రాసినట్లు కూడా ప్యాడీ అప్టాన్ చెప్పాడు. సెక్స్ చేయడం వల్ల మీరు మెరుగైన ప్రదర్శన చేయగలరా? అన్న ప్రశ్నకు.. అవును, కచ్చితంగా అని అప్టాన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాహుల్ ద్రవిడ్‌ను ఎస్ శ్రీశాంత్ తిట్టడం, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ గురించి కూడా అప్టాన్ తన బుక్‌లో ఎన్నో విషయాలు చెప్పాడు. అప్టాన్ ప్రస్తుతం టీ20 లీగ్ జట్లకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

మరోసారి విశ్వవిజేతగా
2011 ప్రపంచకప్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 1983 తర్వాత భారత జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2011 ఏప్రిల్ 2న ముంబై వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె ( 88 బంతుల్లో 13 ఫోర్లతో 103 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ సెహ్వాగ్ (0), సచిన్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో గంభీర్ (122 బంతుల్లో 9 ఫోర్లు 97).. కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కోహ్లీ ఔటైనా ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. యువరాజ్‌తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ను ముగించాడు.


Click it and Unblock the Notifications

ENG vs SL: బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి.. అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయి: టీమిండియా క్రికెటర్










