Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs SL: బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి.. అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయి: టీమిండియా క్రికెటర్

Dinesh Karthik Makes Controversial Statement Says Bats Are Like Neighbours Wife

లండన్: బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివని, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని టీమిండియా వెటరన్‌ వికెట్ కీపర్, కామెంటేటర్ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కార్తీక్ క్రికెట్‌ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో సరసన కూర్చొని తన గొంతుని వినిపించాడు. వ్యాఖ్యానం చేయడం అదే మొదటిసారి అయినా.. ఎక్కడా తడబడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాతగా.. మ్యాచ్ అప్‌డేట్స్, సౌథాంప్టన్‌ వాతావరణ పరిస్థితులను అభిమానులకు ఇప్ప్పటికపుడు తెలియజేసి 'శభాష్' అనిపించుకున్నాడు.

స‌ర‌దా కామెంటరి

తాజాగా ఇంగ్లండ్‌, శ్రీలంక వ‌న్డే సిరీస్ కోసం కూడా స్కై స్పోర్ట్స్‌తో దినేశ్‌ కార్తీక్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండు టీమ్స్ మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా అత‌డు చేసిన కామెంట‌రీ ఇప్పుడు న‌వ్వు తెప్పిస్తోంది. సాధార‌ణంగా భారత కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌ లాంటి వాళ్లు కామెంట‌రీలోనూ అప్పుడప్పుడూ స‌ర‌దా విష‌యాలు మాట్లాడుతూ న‌వ్వు తెప్పిస్తుంటారు.

ఇప్పుడు కార్తీక్ కూడా అలాంటి కామెంట‌రీతో ఆక‌ట్టుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌, బ్యాట్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో.. కార్తీక్ చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట అవుతోంది.

బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి

బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి

'బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్లు న‌చ్చ‌క‌పోవ‌డం అనేది చాలా కామ‌న్‌ విషయం. ఎప్పుడూ అది జ‌రిగేదే. చాలా మంది బ్యాట‌ర్లకు త‌మ బ్యాట్లు న‌చ్చ‌వు. వాళ్ల‌కు అవ‌త‌లి బ్యాట్స్‌మ‌న్ బ్యాట్ మాత్రం చాలా బాగా న‌చ్చుతుంది. ఒక‌విధంగా బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయి' అని దినేష్ కార్తీక్ సరదాగా అన్నాడు. కార్తీక్ వ్యాఖ్యానంకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మొదటి భార్య నికితా వంజర గుర్తోచ్చిందేమో' అని కామెంట్లు చేస్తున్నారు. కార్తీక్ మొదటి భార్య నికితా క్రికెటర్ మురళీ విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Sri Lanka vs India: టీమిండియా తర్వాతి కోచ్‌ రాహుల్ ద్ర‌విడే.. హింట్ ఇదే!!

మరో కోణాన్ని చూడటానికే

మరో కోణాన్ని చూడటానికే

కొత్తగా ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి గల కారణాలను దినేశ్‌ కార్తీక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించాడు. 'వ్యాఖ్యాతగా మారడం అనేది నేను మాటల్లో వర్ణించలేను. క్రికెట్‌లోని మరో కోణాన్ని చూడటానికే నేను ఈ ప్రయాణాన్ని మొదలెట్టాను. మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానాలు, మద్ధతు ఈ ప్రయాణాన్ని మరింత ఉన్నతంగా మార్చాయి. మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటా' అని దినేశ్‌ కార్తీక్‌ ఓ వీడియో పంచుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ టార్గెట్

టీ20 ప్రపంచకప్‌ టార్గెట్

దినేశ్ కార్తీక్‌ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారి ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులు చేశాడు. దాంతో అప్పటి నుంచి డీకేను భారత్ తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం అతడు ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Friday, July 2, 2021, 15:21 [IST]
Other articles published on Jul 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+