మామ.. ఇది ఔటా? నాటౌటా?(వీడియో)
సోషల్ మీడియాలో ఓ ఫన్నీ క్రికెట్ వీడియో వైరల్‌గా మారింది. ఓ టెన్నిస్ బాల్ టోర్నీకి సంబంధించిన ఈ వీడియో క్రికెట్ పండితులు, అభిమానులకు పెద్ద పజిల్‌గా మారింది. ఐసీసీ క్రికెట్ రూల్స్‌నే సవాల్ చేసేలా ఉన్న ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
వీడియోలో ఏం ఉందంటే..?
టెన్నిస్ బాల్ టోర్నీలో ఓ బ్యాటర్ స్టంప్స్‌కు దగ్గరగా జరిగి లెగ్ సైడ్ ఓ భారీ షాట్ ఆడాడు. షాట్ పూర్తయిన తర్వాత బంతిని చూస్తూ ఒంటి చేత్తో బ్యాట్‌ను స్వింగ్ చేశాడు. బ్యాట్ తగలడంతో తన తలపై ఉన్న క్యాప్ వికెట్లపై పడింది. దాంతో బెయిల్స్ కింద పడగా.. ఫీల్డింగ్ టీమ్ ఔట్ అంటూ అప్పీల్ చేసింది. ఇది ఔటా? నాటౌటా? అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు ఔట్ అంటే మరికొందరు నాటౌట్ అని కామెంట్ చేస్తున్నారు. కొందరు ఐసీసీ రూల్స్‌ను వివరిస్తూ తమ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నారు. మరికొందరు ఏఐ చాట్‌బాట్‌ల సాయం తీసుకుంటున్నారు.

ఇది నాటౌట్:గ్రోక్
ఎక్స్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్.. ఇది నాటౌట్‌గా తేల్చింది. క్రికెట్ నిబంధనలను రూపొందించే ఎంసీసీ రూల్స్ 35, 29 ప్రకారం ఇది నాటౌట్ అని స్పష్టం చేసింది. ఈ నియమాల ప్రకారం వికెట్ పడగొట్టే పరికరాలను ధరించి లేదా పట్టుకొని ఉండాలని, కానీ క్యాప్ కింద పడిపోయింది కాబట్టి అది ధరించినట్లు కాదని గ్రోక్ పేర్కొంది.
హిట్ వికెట్ అంటే ఏంటంటే?
ఒక బ్యాటర్ బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా బంతిని కొట్టిన తర్వాత తొలి పరుగు కోసం పరుగెత్తినప్పుడు తన బ్యాట్, శరీరం, అతను ధరించిన పరికరాలు వికెట్లకు తగిలి బెయిల్స్ పడిపోతే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు.
రూల్స్ ఏంటంటే..?
- బౌలర్ బంతిని వేసేటప్పటి నుంచి డెడ్' అయ్యే లోపే ఇది జరగాలి. ఆ తర్వాత వికెట్లను తాకినా హిట్ వికెట్‌గా పరిగణించరు.
- బ్యాటర్ తన బ్యాట్, చేతులు, కాళ్లు, శరీరంలోని ఏ ఇతర భాగమైనా వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు.
- బ్యాటర్ ధరించిన హెల్మెట్, టోపీ, గ్లౌజులు కూడా వికెట్లను పడగొట్టినట్లయితే అది హిట్ వికెట్‌గా పరిగణించబడుతుంది. కానీ శరీరంతో ఆ వస్తువులు కాంటాక్ట్ అయ్యి ఉండాలి. క్యాప్, హెల్మెట్, గ్లోవ్స్, బ్యాట్ జారి వికెట్లపై పడితే హిట్ వికెట్‌గా పరిగణించరు. వికెట్లను తాకే సమయంలో ఆ వస్తువులు శరీరంతో కాంటాక్ట్ అయ్యి ఉండాలి.
- నో బాల్‌కు హిట్ వికెట్ అయినా ఔట్ ఇవ్వరు.
- బంతిని కొట్టిన తర్వాత తొలి పరుగులోపే హిట్ వికెట్ రూల్ వర్తిస్తుంది. ఆ తర్వాత రనౌట్, స్టంపింగ్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వికెట్లను తాకినా హిట్ వికెట్‌గా పరిగణించరు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications