Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuvraj Singh విధ్వంసం.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు (వీడియో)!!

OnThisDay in 2007 T20 World Cup, Yuvraj Singh hitting 6 sixes in an over off Stuart Broad

హైదరాబాద్: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ టీమిండియా సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో తన హిట్టింగ్‌ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపాడు. 13 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు.

 ఆరు బంతుల్లో ఆరు సిక్సులు:

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు:

2007 సెప్టెంబర్ ‌19వ తేదీన డర్బన్ వేదికగా ఇంగ్లండ్, భారత్ తలపడ్డాయి. టీమిండియాకు అది తప్పక గెలవాల్సిన మ్యాచ్. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నారు. అప్పటికి భారత్ స్కోర్ మూడు వికెట్లకు 171. ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్‌ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

 16 బంతుల్లోనే 58 పరుగులు:

16 బంతుల్లోనే 58 పరుగులు:

ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అద్భుతమై ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఔటయ్యారు. అనంతరం 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్‌ ఊతప్ప(6) ఔటయ్యాక.. కెప్టెన్‌ ధోనీ (10), యువరాజ్ ‌((58: 16 బంతుల్లో 3x4, 7x6) క్రీజులోకి వచ్చారు. చివరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించగా.. యువరాజ్ ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు.

యువీపై నోరు జారిన ప్లింటాఫ్:

యువీపై నోరు జారిన ప్లింటాఫ్:

ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆండ్రూ ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదాడు. దీంతో యువీపై ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆ కోపం తర్వాత ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో చూపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్.. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ప్లింటాఫ్‌.. ఓ సిక్స్‌ బాదిన అనంతరం యువీని ఔట్ చేశాడు. మొత్తంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ధోని సేన 200 పరుగులకే కట్టడి చేయడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని నేతృత్వంలోని టీమిండియా తొలి ఐసీసీ వరల్డ్ టీ20 విజేతగా నిలిచింది.

ప్రపంచకప్ ముందు తర్వాత:

ప్రపంచకప్ ముందు తర్వాత:

యువరాజ్ సింగ్ కెరీర్.. టీ20 ప్రపంచకప్ ముందు ఆ తర్వాత అనేంతలా సాగింది. 2007 టీ20 ప్రపంచకప్‌ని గెలిచిన భారత్.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ దూకుడుతో 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ విజేతగా నిలిచింది. ఐతే 2014 నుంచి యువీ కెరీర్ గాడి తప్పింది. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్.. ఇటీవల ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.

IPL 2020: 'ఐపీఎల్‌లో సెల్యూట్స్‌ చేస్తా.. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడమే నా లక్ష్యం'

Story first published: Saturday, September 19, 2020, 12:12 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+